Movie News

లక్షల్లో తీసిన చెత్త సినిమా… కోట్లలో కలెక్షన్లు

ఒక చిన్న వేడుక చేయడానికే కనీసం లక్ష రూపాయలు ఖర్చయ్యే సొసైటీలో ఉన్నాం మనం. అలాంటిది కేవలం రెండు నుంచి మూడు లక్షల రూపాయలతో సినిమా తీసి కోట్లాది వసూళ్లు కళ్ల చూడగలమా. అసలు షార్ట్ ఫిలింకే అంతకన్నా ఎక్కువ డిమాండ్ చేసే పరిస్థితిలో ఇదెలా సాధ్యమో అర్థం కావాలంటే చైనా వైపు చూడాలి. ఇటీవలే అక్కడ ‘నియు లై’ అనే చిన్న సినిమా రిలీజయ్యింది. ఒక తల్లి కొడుకు కలిసి తీశారు. పది రోజుల కలెక్షన్ 8 వేల యువాన్లలోపే. మన కరెన్సీలో జస్ట్ లక్ష రూపాయలన్న మాట.

అసలు ట్విస్టులు చూద్దాం. ఈ నియు లైని చూసింది చాలా తక్కువ జనం అంటే మూడు వందల లోపే. దారుణమైన రివ్యూలు వచ్చాయి. చెత్త సినిమా అంటూ విమర్శకులు క్లాసులు తీసుకున్నారు. కేవలం 90 నిమిషాల నిడివిలో ఇంత తక్కువ క్వాలిటీ మూవీ చూడలేదంటూ తిట్టి పోశారు. చీప్ యానిమేషన్ తో ఒక ఆవు పిల్ల, స్కై లార్జ్ పక్షి మధ్య జరిగే సంఘటనలతో దీన్ని తయారు చేశారు. సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా కనిపించడం నెటిజెన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

నిజంగా అంత చెత్తగా ఏముందో చూద్దామని జనం మెల్లగా థియేటర్లకు వెళ్లడం మొదలుపెట్టారు. అలా వైరల్ గా మారిపోయి ఇప్పుడు ఏకంగా 23 కోట్ల వసూళ్లను దాటేసి ఈ ఏడాది చైనా టాప్ హిట్స్ లో ఒకటిగా నిలబడేందుకు పరుగులు పెడుతోంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సున్ లిఫాంగ్, జిన్ యుమెంగ్ అనే తల్లి కొడుకుల అయిదేళ్ల పాటు కష్టపడి ఈ సినిమాను రాసుకుని, వాళ్లే నిర్మించుకుని, స్వంతంగా రిలీజ్ చేసుకున్నారు. ట్రైలర్, ప్రమోషన్లు ఏదీ జరగలేదు.

ఒకరకంగా చూస్తే జెన్ జీ ప్రేక్షకులకు ఒక్కోసారి అర్థం లేని చెత్తను కూడా అమ్మోచ్చనే ఆలోచన దీని నుంచే కలుగుతోంది. స్పైడర్ మ్యాన్, ఒడిస్సి లాంటి క్రేజీ హాలీవుడ్ మూవీస్ వీరవిహారం చేస్తున్న టైంలోనూ నియు లైకి ఆదరణ దక్కడం పెద్ద విశేషం.అలాని సినిమా చూసిన జనాల అభిప్రాయం మారడం లేదు. ఇదేం టార్చర్ అని తిట్టుకుంటూనే పక్కవాళ్ళకు రికమండ్ చేస్తున్నారు. ఏఐ పెరిగిపోయిన ప్రపంచంలో ఇలా చీప్ గ్రాఫిక్స్ సినిమాకు ఇంత పట్టడం కట్టడం మహా విచిత్రం. 

This post was last modified on August 19, 2026 10:02 pm

Share

Recent Posts

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

6 minutes ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

1 hour ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

1 hour ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

2 hours ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

2 hours ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

2 hours ago