భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన విరాళాల వివరాలను వెల్లడించాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రూ.58.25 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) రూ.24.31 కోట్లు, భారత్ రాష్ట్ర సమితి(BRS) రూ.16.44 కోట్లు తమకు అందినట్టు ప్రకటించాయి. ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951’లోని సెక్షన్ 29 సీ కింద దాఖలు చేసిన నివేదికలు, 20,000 కంటే ఎక్కువ మొత్తంలో అందిన విరాళాల వివరాలను ఆయా పార్టీలు వెల్లడించాయి.
ఈ వివరాల ప్రకారం, సదరు ఆర్థిక సంవత్సరంలో అనేక రాజకీయ పార్టీలకు భారీగా విరాళాలు ఇచ్చిన వారిలో ఎన్నికల ట్రస్టులు, కంపెనీలు ఉన్నాయి. అయితే, ఈ గణాంకాలు ఆయా పార్టీలకు 2025-26 సంవత్సరానికి సంబంధించి అందిన మొత్తం ఆదాయం కంటే.. కేవలం విరాళాలుగా అందిన మొత్తాలను మాత్రమే చూపిస్తాయి. ఇక, ఒడిశాకు చెందిన ప్రధాన ప్రతిపక్షం బిజు జనతా దళ్ (బిజెడి) 2025-26 సంవత్సరంలో రూ.20,000కు మించిన విరాళం ఏదీ అందలేదని నివేదించింది. ఎన్నికల సంఘానికి దాఖలు చేసిన దాని ఫారం 24ఏలో, ఈ విరాళం “సున్నా“గా నమోదు చేశారు.
2025-26లో టీడీపీ మొత్తం రూ.58.25 కోట్ల విరాళాలు అందినట్లు నివేదించింది. నాలుగు మార్గాల ద్వారా రూ.25 కోట్లు విరాళంగా అందినట్టు పేర్కొంది. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ అతిపెద్ద దాతగా నిలిచింది. ఇతర విరాళాలలో విపిఆర్ మైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి రూ.5 కోట్లు, సిఎన్‌ఎపిఎస్ ఇంటెల్లికాడ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీరాయలసీమ హై-స్ట్రెంత్ హైపో లిమిటెడ్ నుండి చెరో కోటి రూపాయలు అందాయి. వైసీపీకి రూ.24.31 కోట్ల విరాళాలు అందినట్లు నివేదించింది. పార్టీ దాఖలు చేసిన వివరాల ప్రకారం, గుడ్‌వుడ్ శాంక్చురీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.10 కోట్లు, ఎన్ఏ డివైన్ హ్యాబిటాట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.5 కోట్లు విరాళంగా అందించాయి.
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్‌కు రూ.16.44 కోట్ల విరాళాలు అందినట్లు నివేదించింది. ఎం.ఎస్.ఎన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, కేవీఆర్ బేస్‌లైన్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ చెరో 5 కోట్లు విరాళంగా ఇచ్చాయి. వర్సిటీ సౌత్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా మూడు చెక్కుల ద్వారా 5 కోట్లు విరాళంగా అందించింది. ఇక, ఢిల్లీ ప్రధాన ప్రతిపక్షం ఆప్.. 12.10 కోట్ల విరాళాలు అందినట్లు నివేదించింది. దాని ఫైలింగ్‌లో, ప్రధాన విరాళాలలో ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్, ట్రైడెంట్ లిమిటెడ్ నుండి చెరో 5 కోట్లు అందినట్లు పేర్కొంది.
ట్రైడెంట్ లిమిటెడ్‌ను పంజాబ్‌కు చెందిన బిలియనీర్ రాజిందర్ గుప్తా స్థాపించారు. ఈ ఏడాది ఆరంభంలో బీజేపీలోకి మారడానికి ముందు ఆయన ఆప్ ఎంపీగా ఉన్నారు. ఆప్ మాజీ అధికార ప్రతినిధి, ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సహ-కన్వీనర్‌గా ఉన్న అశుతోష్ రాంకా కూడా ఈ పార్టీకి 21,100 విరాళంగా ఇచ్చారు.
This post was last modified on September 30, 2026 2:25 pm
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…
రాజమౌళి తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే కానీ.. ఔట్ పుట్ మాత్రం వేరే లెవెల్లో…
ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…
ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…