Political News

అన్నయ్యను పలకరించాలి బ్రహ్మానందం గారూ…

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వివాదాలకు పూర్తి దూరంగా ఉండే నటుల్లో బ్రహ్మానందం ఒకరు. నటుడిగా ఆయన సంపాదించుకున్న ఆదరణ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అదే సమయంలో బ్రహ్మీకి అందరివాడిగా, మంచి వ్యక్తిగా పేరుంది. దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్లో బ్రహ్మి చుట్టు ముసురుకున్న వివాదాలు పెద్దగా కనిపించవు. అలాంటి వ్యక్తి మీద సొంత అన్నయ్య కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన పేరు శ్రీనివాస్.

తన తమ్ముడు తన కుటుంబానికి గతంలో ఎంతో సాయం చేసినట్లు అంగీకరిస్తూనే.. చాలా ఏళ్ల నుంచి తనతో మాట్లాడకపోవడం, కలవకపోవడం, పలకరించకపోవడం పట్ల ఆయన ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి తమ ప్రాంతానికి వచ్చి కూడా ఇంటికి రాలేదని శ్రీనివాస్ వాపోయారు.

బ్రహ్మానందం తమ ఊరికి వస్తే జనాలను కంట్రోల్ చేయడం కష్టమని చెబుతూనే.. ఆయన దగ్గరికే తనను పిలిపించుకోవచ్చు కదా లేదా హైదరాబాద్‌కు మనిషిని తోడుబెట్టి రప్పించుకోవచ్చు కదా.. అసలు ఎప్పుడైనా ఫోన్ చేసి ఎలా ఉన్నావ్, ఆరోగ్యం ఎలా ఉంది అని పలకరించవచ్చు కదా అని శ్రీనివాస్ అన్నారు.

తమ తల్లిదండ్రులకు తాము ఆరుగురు సంతానం అని.. అందులో మిగతా నలుగురు చనిపోగా.. తాను, బ్రహ్మానందం మాత్రమే మిగిలామని శ్రీనివాస్ తెలిపారు. బ్రహ్మానందం చదువు కోసం చిన్నతనంలోనే అత్తిలి వెళ్లిపోయాడని, అక్కడే లెక్చరర్‌గా ఉద్యోగం సంపాదించి.. ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నాడని.. ఆ పెళ్లి తమ తండ్రికి నచ్చకపోయినా తామంతా నచ్చజెప్పి పెళ్లికి వెళ్లామని.. తర్వాత బ్రహ్మానందం సినిమాల్లో అవకాశం సంపాదించి హైదరాబాద్‌కు వెళ్లిపోయాడని శ్రీనివాస్ గుర్తు చేసుకున్నారు.
బ్రహ్మానందం తమ కుటుంబానికి సాయం చేయకుండా ఏమీ లేదని..

తనకు ఇల్లు కట్టించాడని, ముగ్గురు పిల్లల పెళ్ళిళ్ళకూ సాయం చేశాడని.. మిగతా తోడబుట్టిన వారికి కూడా సాయం అందించాడని.. ఇవన్నీ చేసినప్పటికీ ఈ వయసులో తమ్ముడు తనకు ఫోన్ చేసి మాట్లాడట్లేదనే, కలవట్లేదనే బాధ మాత్రం ఉందని శ్రీనివాస్ చెప్పారు. తనకు తానుగా బ్రహ్మానందానికి ఫోన్ చేయాలన్నా, కలవాలన్నా ఒకింత భయం అని.. అలాగే తనకు ఆరోగ్యమూ సహకరించడం లేదని.. తాను తమ్ముడి నుంచి డబ్బు ఆశించడం లేదని.. కేవలం పలకరింపు మాత్రమే కోరుకుంటున్నానని అన్నారు శ్రీనివాస్.

ఐతే ఇదంతా ఏదో డిమాండ్ చేస్తున్నట్లు కాకుండా.. అభ్యర్థన పూర్వకంగానే శ్రీనివాస్ మాట్లాడారు. కాబట్టి బ్రహ్మి తన అన్నయ్యకు ఫోన్ చేసి పలకరించడం, వీలైతే వెళ్లి కలవడం, లేదా తన దగ్గరికి పిలిపించుకోవడం చేయాలని ఈ వీడియో చూసిన వాళ్లు అభిప్రాయపడుడుతన్నారు.

This post was last modified on August 19, 2026 3:53 pm

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

2 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

3 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

3 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

4 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

4 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

4 hours ago