Political News

విద్యార్థుల పోరాటానికి దిగివచ్చిన మరో ప్రభుత్వం

ప్రస్తుతం దేశంలో జెన్ జీ హవా నడుస్తుంది. ఏ నిముషంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం జరిగిందో కానీ దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి లోకం ఉవ్వేత్తున ఎగిసి పడుతోంది. హక్కుల సాధనలో ప్రభుత్వాల మెడలు వంచుతుంది. దాంతో ప్రభుత్వం వర్సస్ జెన్ జీ అన్నట్టు పరిస్థితి తయారైందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో భారీ అవకతవకలు జరిగాయంటూ ఢిల్లీ జంతర్ మంతర్ తరహాలో ఉద్యమం జరిగింది. జేఎల్కేఎం నాయకుడు దేవేంద్రనాథ్ మహాతో నేతృత్వంలో 24 రోజుల పాటు జరిగిన ఉద్యమం జేఎంఎం, కాంగ్రెస్ సంయుక్త ప్రభుత్వానికి ముచ్చేమటలు పోయించింది. విద్యార్థుల తరుపున ఆమరణ దీక్ష చేపట్టిన మహాతో బలవంతంగా రాంచీ ఆసుపత్రికీ తరలించిన తర్వాత ఉద్రిక్తలు పెరిగాయి. దాంతో రెచ్చిపోయిన విద్యార్థులు ఆగస్టు 20 వ తేదీన అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం దేశంలో సంచలనం సృష్టించింది. 

ఈ మొత్తం పరిణామాలతో జంతర్ మంతర్ తో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మైలేజీ మంటగలిసే పరిస్థితి ఏర్పడింది. దాంతో స్పందించిన రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు క్లాస్ పీకారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడమని సూచించారు. పేపర్ లీకేజి పై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

ఎట్టకేలకు హేమంత్ ప్రభుత్వం దిగివచ్చింది. టీఎస్సార్ డేటా ప్రాసేసింగ్ ప్రైవేటు లిమిటెడ్ 2014 నుంచి నిర్వహించిన పరీక్షలన్నిటినీ రద్దు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైండ్ గ్రాడ్యూయేట్ లెవెల్ పరీక్షలను సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.  2014 నుంచి జరిగిన అన్నీ పరీక్షలకు సంబందించి సీఐడీ విచారణకు అంగీకరించింది. ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లకు అంగీకరించడంతో మహాతో దీక్షను విరమించారు. 

జార్ఖండ్ విద్యార్థుల ఉద్యమం విజయంతో జెన్ జీలో ఉత్సాహం కనిపిస్తుంది. ఇదే అదనుగా ఇన్నాళ్లు నిర్లక్ష్యానికి గురైన విద్యారంగం సంస్కరణ కోసం జెన్ జీ 2.0 ఉద్యమం నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. దానికి తోడు ఆల్ఫా జెన్ కూడా ఎక్కడిక్కడ బయటకు వచ్చి పోరాడుతున్నారు. ఇది పాలకులకు ఒక హెచ్చరికలాంటిదని మేధావులు విశ్లేషిస్తున్నారు.

This post was last modified on August 18, 2026 8:56 am

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

4 hours ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

5 hours ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

5 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

9 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

10 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

11 hours ago