ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి ఒక అంగన్వాడీ టీచర్ ను ఎంపిక చేసి నూతన ఒరవడి సృష్టించారు. ఈ నిర్ణయం పట్ల టీడీపీ శ్రేణులు సైతం ఆశ్చార్యానికి గురయ్యారు. సీనియర్ నాయకులు పలువురు ఎమ్మెల్సీ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు బాబు మాత్రం తన దైన శైలిలో నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఎమ్మెల్సీ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు సైతం తమకు పదవి రాలేదని బాధపడటం లేదు. భలే మంచి నిర్ణయం తీదుకున్నారంటు అభినందిస్తున్నారు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి ఏపీ నుంచి ఇద్దరు అభ్యర్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కృష్ణా జిల్లాకు చెందిన ఎస్సీ నాయకుడు వర్ల రామయ్య ను ఒక ఎమ్మెల్సీ గా ఎంపిక చేశారు. రెండో ఎమ్మెల్సీ స్థానానికి అనంతపురం లోక్ సభ నియోజకవర్గ అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలు దళవాయి రమాదేవిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీలో ఎవరూ ఊహించని ఒక సాధారణ మహిళను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సహజంగా అయితే పదవి దక్కని నాయకుల్లో అసంతృప్తి కనిపిస్తుంది. కానీ అంగన్వాడీ టీచర్ ఎంపిక పట్ల సానుకుల వాతావరణం కనిపిస్తుంది. నిజానికి కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటు కారణంగా అనేక మంది సీనియర్ నాయకులకు టికెట్టు ఇవ్వలేక పోయారు. భవిష్యత్తులో వారికి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దాంతో అనేకమంది నాయకులు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కోసం ప్రయత్నాలు చేశారు. కుల సమీకరణ నేపథ్యంలో పలువురి పేర్లను పరిశీలించారు కూడా. ఏమి జరిగిందో ఏమో కానీ వారినందరిని కాదని అనూహ్యంగా ఒక సాధారణ మహిళకు అదీ ఒక అంగన్వాడీ టీచర్ ను ఎంపిక చేశారు.
ప్రస్తుతం దేశమంతా మహిళా రిజర్వేషన్ల గురించి దేశమంతా చర్చ జరుతుంది. చివరి 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. అయినప్పటికీ అమలుకి నోచుకోలేదు. ఇటీవల ఈ బిల్లు విషయంలో పార్లమెంట్లో తీవ్రమైన చర్చ జరిగింది. ఒట్టి మాటలతో సరిపెట్టుకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతల్లో మహిళకు అధికారంలో భాగస్వామ్యం కల్పించాలన్న నిర్ణయం తీసుకున్నారని చర్చ జరుగుతుంది.
This post was last modified on August 18, 2026 8:59 am
గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత.. పార్టీ పుంజుకుంటున్న పరిస్థితి…
రాజమౌళితో సినిమా చేయాలని ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి పేరున్న హీరో ఆశపడుతుంటాడు అనడంలో సందేహం లేదు. ఐతే రాజమౌళి…
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఎలా ఉన్నా.. ప్రజలతో మాత్రం పార్టీలకు సాన్నిహిత్యం ఉండాలి. అది కొరవడితే.. ఎప్పటికీ చేరువ…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్…
పెద్ద బడ్జెట్ పెట్టి, చాలా కాలం కష్టపడి, ఎన్నో ఆశలతో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే తట్టుకోవడం తేలిక…
ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో అత్యంత శ్రద్ధ చూపిస్తున్న విషయం తెలిసిందే. రైతుల నుంచి భూములు సమీకరించడం(పూలింగ్)…