అమరావతిలో ప్రభుత్వం నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 6 సంవత్సరాలపాటు కట్టిన 9 అంతస్తుల క్వార్టర్లలో ఒక్క ఎమ్మెల్యే అయినా వచ్చి ఉంటారా అని నాని ప్రశ్నించారు. అంతేకాదు, ఆ క్వార్టర్లను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల డ్రైవర్లకు ఇస్తారని, వాళ్లు కూడా అందులో ఉండకపోతే అసాంఘిక కార్యకలాపాలకు ఆ క్వార్టర్లు అడ్డాగా మారతాయని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇక, ప్రభుత్వం ప్రమోషన్ వీడియోలు చేసుకుంటోందని, ఈ క్వార్టర్లు కట్టి ఏదో భూమి బద్దలైనట్లు హడావుడి చేస్తోందని నాని ఎద్దేవా చేశారు. అమరావతి అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు చేస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే నాని కామెంట్లు కరెక్ట్ కాదని కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరూపిస్తారా అన్న చర్చ మొదలైంది.
ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని నాని నోరు జారడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే, వైసీపీ హయాంలో ఆ క్వార్టర్స్ లో అటువంటి కార్యకలాపాలు జరిగాయా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక, ఈ క్వార్టర్స్ కట్టేందుకు ఆరేళ్లు పట్టింది అని నాని ఎద్దేవా చేస్తున్నారు.. కానీ, అందులో ఐదేళ్లపాటు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందన్న సంగతి మరిచిపోయారని సెటైర్లు వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates