ప్రియదర్శికి కలిగిన ప్రయోజనం ఎక్కువే

టాలెంట్ లోటు లేకపోయినా కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల ప్రియదర్శి కెరీర్ రెండు హిట్లు నాలుగు ఫ్లాఫుల్లా సాగిపోతోంది. టాలీవుడ్ లో బాగా బిజీగా ఉన్న హీరోల్లో తనూ ఒకడు. ఇడుపుకాగితం ఆల్రెడీ ఎంత సౌండ్ చేస్తుందో చూస్తున్నాం. అయితే రెండున్నర గంటలు ఇవ్వలేని గుర్తింపు ప్యారడైజ్ లో కేవలం అయిదారు నిమిషాల ఎపిసోడ్ ఇచ్చిందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా నైజామ్ సర్కిల్స్ లో తను పోషించిన కెసిఆర్ పాత్ర కోసమే సినిమాకు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు.

ఏదో మేకప్ వేసుకుని మేనేజ్ చేయడం కాదు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, ముఖ కవళికను అచ్చు గుద్దినట్టు దించేసిన ప్రియదర్శికి థియేటర్లలో క్లాప్స్ పడుతున్నాయి. ఈలలతో బిఆర్ఎస్ పార్టీ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ పెద్దాయన బయోపిక్ ఎవరైనా తీసే క్రమంలో ప్రియదర్శి కంటే మంచి ఛాయస్ ఉండకపోవచ్చు. నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ఆల్రెడీ ఆ పనుల్లో ఉన్నట్టు సమాచారం. స్క్రిప్ట్ తయారు చేయించాక అనుమతులు వగైరా వ్యవహారాలు చూసుకుంటారని టాక్.

మరి ఈ ప్రమోషన్ ని ప్రియదర్శి ఎలా నిలబెట్టుకుంటాడో చూడాలి. ఎందుకంటే నాని, మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్, ఈశ్వరిరావు, తనికెళ్ళ భరణి లాంటి సీనియర్లు ఇంత మంది ఉండగా సోషల్ మీడియాలో తనకే ఎక్కువ రికగ్నైజేషన్ రావడం అంటే మాటలు కాదు. అందులోనూ ఆ వీడియో క్లిప్స్ ని ఇన్స్ టా, ఎక్స్ తదితర మాధ్యమాల్లో తెగ వైరల్ చేయడం చూస్తే రీచ్ ఎంత భారీగా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కొందరు ఆల్రెడీ ఇలాంటి పాత్రలతో కలిశారంట.

నేటివిటీ పరంగా ప్రియదర్శి తెలంగాణ వాడు కావడం మరింత ప్లస్ అవుతోంది. ముఖ్యంగా బలగం నుంచి మంచి జోష్ లోకి వచ్చాడు. కాకపోతే కొన్ని తీవ్రమైన ఫ్లాపులు మార్కెట్ మీద ప్రభావం చూపించినప్పటికీ డౌన్ లో ఉన్న టైంలో హిట్ మూవీ పడుతోంది. టైటిల్ దగ్గరే వివాదం చేసుకున్న ఇడుపుకాగితంకి బిజినెస్ ఎంక్వయిరీలు బాగున్నాయి. ఇటీవలే విడుదల చేసిన పాట జనంలోకి వెళ్ళింది. కంటెంట్ ప్రామిసింగ్ గానే ఉంది. అంచనాలు నిలబెట్టుకుంటే హిట్టు పడ్డట్టే.