దేశంలోని రాష్ట్రాలు.. కేంద్రప్రాంత పాలిత ప్రాంతాలకు చెందిన పాలకులతో ప్రధాని మోడీ సమావేశం కావటం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో దేశ వ్యాప్తంగా టీకాలు ఇవ్వనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
వ్యాక్సిన్ కోసం ప్రజాప్రతినిధులు క్యూలు కట్టొద్దని.. రాజకీయం చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు తమ వరకు వంతు వచ్చే వరకు వెయిట్ చేయాలే తప్పించి.. తమకు తాముగా ప్రయత్నాలు చేయొద్దని తేల్చి చెప్పారు. తొలిదశ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వర్గాల జాబితాలో ఎంపీలు.. ఎమ్మెల్యేలను చేర్చాలని కోరగా.. ప్రధాని మోడీ ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు.
హర్యానా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను మోడీ కొట్టేశారు. రాజకీయ నేతలు తమ వంతు వరకు వచ్చే వరకు వ్యాక్సిన్ కోసం వెయిట్ చేయాలే తప్పించి.. ఒత్తిడితో వేయించుకునే ప్రయత్నం చేయొద్దన్నారు. తొలిదశలోకోటి మంది హెల్త్ వర్కర్లు.. రెండుకోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు తొలిదశలో వ్యాక్సిన్ అందిస్తారు. ఫ్రీగా ఎవరికి టీకా ఇవ్వాలని అన్న విషయాన్ని కేంద్రం జాబితాను సిద్ధం చేసింది. మరి.. మోడీ మాష్టారి మాటలు కెరకుగానే ఉన్నాయి.. చేతల్లో ఏమేరకు చూపిస్తారో చూడాలి.