Political News

విప‌క్ష హోదా కూడా లేనిపార్టీ… వైసీపీపై ప‌వ‌న్ ఫైర్‌

“విప‌క్ష హోదా కూడా లేని పార్టీ“ అంటూ వైసీపీ పై ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ మండిప‌డ్డారు. అలాంటి పార్టీ భ‌క్తుల విశ్వాసాల‌తో ఆడుకుంటోంద‌ని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకునేది లేద‌న్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీ నాయ‌కులు చ‌ట్ట ప్ర‌కారం.. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతోపాటు న్యాయ‌స్థానాల‌ను కూడా ఆశ్ర‌యించాల‌ని ఆదేశించారు. అదేస‌మ‌యంలో వైసీపీ చేసిన త‌ప్పులు జ‌న‌సేన స‌హా కూట‌మి పార్టీల నాయ‌కులు ఎవ‌రూ చేయొద్ద‌ని హిత‌వు ప‌లికారు. ఈ మేర‌కు జ‌న‌సేన‌ పార్టీ కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల‌చేసింది.

విష‌యం ఏంటంటే..

వైసీపీ ఇటీవ‌ల మెగా డీఎస్సీ-2025లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ఆరోపిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చింది. ఈ క్ర‌మంలో నెల్లూరులో వైసీపీ నాయ‌కులు కొంద‌రు నిర్వ‌హించిన నిర‌స‌న‌లో తిరుమ‌ల శ్రీవారి గోవింద నామాల‌ను అప‌హాస్యం చేసేలా నినాదాలు చేశారు. గోవింద నామాల‌ను ప్యారెడీ పాట‌లుగా అల్లి.. నినాదాల‌తో హోరెత్తించారు. ముఖ్యంగా చంద్ర‌బాబును ఉటంకించేలా.. ఈ నినాదాలు ఉన్నాయి. `సూప‌ర్ సిక్స్‌-గోవిందా.`, `ఆడ‌బిడ్డ నిధి-గోవిందా`, `నిరుద్యోగ భృతి గోవిందా`, `మెగా డీఎస్సీ-గోవిందా` వంటి ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌ను కూడా ఉటంకిస్తూ.. ఈ నినాదాలు చేయ‌డం గ‌మ‌నార్హం.

వీటికిసంబంధించిన వార్త‌లు, రీల్స్‌.. సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అయ్యాయి. వీటిపై స్పందించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. శ్రీవారి ప్ర‌తిష్టను, భ‌క్తుల మ‌నోభావాల‌ను ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేని ఓ పార్టీ దెబ్బ‌తీస్తోంద‌ని.. దీనిని చూస్తూఊరుకునేది లేద‌ని తెలిపా రు. ఈ నిర‌స‌న‌లో పాల్గొన్న వారు వ్య‌వ‌హ‌రించిన తీరు ధార్మిక సంస్థ‌ల గౌర‌వాన్ని.. భ‌క్తుల మ‌నోబావాల‌ను తీవ్రంగా దెబ్బ తీశారని పేర్కొన్నారు. అదేస‌మ‌యంలో మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టాల‌న్న కుట్ర‌లు కూడా దాగి ఉన్నాయ‌ని తెలిపారు. వీటిని చూస్తూ ఊరుకునేది లేద‌న్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీ నాయ‌కులు చ‌ట్టం ప్ర‌కారం పోలీసుల‌కు ఫిర్యాదు చేయాల‌ని ఆదేశించారు.

మ‌రోవైపు ఇప్ప‌టికే నెల్లూరు జిల్లా పోలీసుల‌కు ధార్మిక సంఘాల ప్ర‌తినిధులు ఫిర్యాదు చేశారు. దీంతో రెండు కేసులు న‌మోద య్యాయి. ఆ రోజు వైసీపీ త‌ర‌ఫున నిర‌స‌న‌లో పాల్గొన్న వారిపై ఈకేసులు పెట్టిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు. తాజాగా డిప్యూ టీ సీఎం స్పంద‌న‌తో మ‌రిన్ని కేసులు న‌మోదయ్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇదిలావుంటే.. వైసీపీ ఈ వ్య‌వ‌హారంపై ఎదురు దాడి చేయ‌డం గ‌మ‌నార్హం. గోవిందా! అనే ప‌దానికి అనేక అర్థాలు ఉన్నాయ‌ని.. వాటిని తెలుసుకుంటే మంచిద‌ని వైసీపీ కార్యాల‌యం పేర్కొంది. విష‌యం తెలియ‌కుండానే కేసులు పెట్ట‌డం స‌రికాద‌ని.. న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యిస్తామ‌ని తెలిపింది.

This post was last modified on August 12, 2026 11:32 am

Share

Recent Posts

చేతులు మారిన ర‌వితేజ సినిమా?

చాలా కాలంగా స‌రైన విజ‌యం లేక ఇబ్బంది ప‌డుతున్న‌ప్ప‌టికీ.. మాస్ రాజా ర‌వితేజకు అవ‌కాశాల విష‌యంలో లోటేమీ లేదు. ఇంత‌కుముందులా…

2 hours ago

హద్దుల్లేని విచ్చలవిడితనం తెర మీద చూస్తారా

కరోనా సమయంలో బ్లాక్ బస్టర్ అనిపించుకున్న వెబ్ సిరీస్ లలో మీర్జాపూర్ ఒకటి. కలీన్ భాయ్, అతని కొడుకుతో పాటు…

2 hours ago

అల్లరోడి సత్తాకి దేవకన్యల పరీక్ష

చాలా కాలంగా ఫామ్ లో లేని అల్లరి నరేష్ కామెడీ వర్కౌట్ కావడం లేదని భావించి రకరకాల జానర్లు ట్రై…

3 hours ago

ఫేకు కుట్రలకు కూటమి చెక్

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వుంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేసి 164 సీట్లలో విజయభేరి…

3 hours ago

త్రిష పోస్టు ఎవరినుద్దేశించి?

ఈ మధ్య తమిళ సీనియర్ హీరోయిన్ త్రిష పెద్దగా సినిమాలు చేస్తున్నట్లు కనిపించట్లేదు. అయినా ఆమె పేరు మాత్రం నిత్యం…

3 hours ago

స్వాతంత్ర్య వేడుకల్లో ఎర్రకోటపై జెన్ జీ

ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ లు చేపట్టిన ఆందోళన ప్రభావం కేంద్ర ప్రభుత్వం మీద ఎంతో తీవ్రమైన ఎఫెక్ట్…

7 hours ago