Movie News

వైష్ణవి చైతన్య వయసెంత?

ఫిలిం సెలబ్రెటీల సినిమా ముచ్చట్లే కాదు.. వాళ్లకు సంబంధించి ప్రతి వ్యక్తిగత విషయమూ అభిమానులకు ఆసక్తికరమే. వయసు, బరువు, హైట్, ప్రాంతం, కులం.. ఇలా ప్రతి విషయం తెలుసుకోవాలనుకుంటారు. కొందరి వయసు విషయంలోనూ సోషల్ మీడియాలో చర్చలు పెట్టేస్తుంటారు. ఇటీవల యువ కథానాయిక వైష్ణవి చైతన్య వయసు గురించి ఒక డిస్కషన్ మొదలైంది సోషల్ మీడియాలో.

షార్ట్ ఫిలిమ్స్‌తో మొదలుపెడితే.. వైష్ణవి దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. చూడ్డానికి చిన్నమ్మాయిలా కనిపిస్తుంది కానీ.. ఆమె వయసు తక్కువేమీ కాదని, ఆమెకు 32 ఏళ్ల వయసు వచ్చేసిందని ఒక ప్రచారం మొదలైంది. వైష్ణవి బయోడేటా వివరాలు ఇచ్చిన కొన్ని వెబ్ సైట్లతో పాటు వికీపీడియాలో కూడా ఆమె ఏజ్ 32 ఏళ్లు అనే ఉంది. దీంతో ఆమె అంత పెద్దదా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఐతే ఈ ప్రచారానికి తాజాగా ఒక పాడ్ ‌కాస్ట్‌లో వైష్ణవి తెరదించింది.

యాంకర్ తన వయసు గురించి అడిగి.. వికీపీడియా పేజీల్లో వివరాల గురించి ప్రస్తావించడంతో వైష్ణవి స్పందిస్తూ.. తనకు అంత వయసు లేదంది. తన ఏజ్ 25 ఏళ్లు అని, కావాలంటే ఆధార్ కార్డు చూడండి అంటూ ఆ కాపీని చూపించింది. తనకు నిజంగా 32 ఏళ్లు అయితే ఆ విషయం చెప్పడానికి తనకు మొహమాటం ఏమీ లేదని.. కానీ తనకు 25 ఏళ్లే అని ఆమె స్పష్టం చేసింది. మూడేళ్ల ముందు వైష్ణవి ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి స్టార్ అయింది.

కానీ ఆ సినిమా తర్వాత ఆమెకు కలిసి రావడం లేదు. ‘లవ్ మి’, ‘జాక్’ సినిమాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. ‘బేబి’ తర్వాత ఆనంద్ దేవరకొండతో కలిసి నటించిన ‘ఎపిక్’ మీద ఆమె భారీ ఆశలు పెట్టుకుంది. కానీ పది రోజుల కిందట రిలీజైన ఆ సినిమా కూడా ఆమెకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ దర్శకుడు రూపొందించిన ఈ మూవీ కూడా డిజాస్టరే అయింది. దీంతో నితిన్ సరసన నటిస్తున్న కొత్త సినిమా మీద ఆమె చాలా ఆశలతో ఉంది.

This post was last modified on September 21, 2026 5:53 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

7 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

10 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

11 hours ago