రాజమౌళి సినిమా అంటే.. ఫ్యామిలీ అంతా కలిసి ఎలా కష్టపడతారో.. ఎంతగా ఇన్వాల్వ్ అవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్లోనే కాదు.. ప్రపంచంలో ఇంకెక్కడా కూడా ఒక ఫ్యామిలీకి చెందిన ఇంతమంది ఒక సినిమాలో ఇన్వాల్వ్ అయి.. ఇంతలా కష్టపడడం, ఇంత గొప్ప ఔట్ పుట్ తీసుకురావడం ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ కుటుంబానికి చెందిన 20 మంది దాకా రాజమౌళి సినిమాలో ఇన్వాల్వ్ అవుతారు.
ఐతే ఈ కష్టం, సహకారం రాజమౌళి డైరెక్ట్ చేసే సినిమాలకు మాత్రమే పరిమితం కాదు. ఫ్యామిలీలో ఇంకెవరు వేరే సినిమా తీసినా సరే.. మొత్తం గ్యాంగ్ అంతా దిగిపోతుంది. అవసరమైన సాంకేతిక, ప్రచార సహకారం అందిస్తుంది. ఇప్పుడు ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ సినిమాను రాజమౌళి కుటుంబం ప్రమోట్ చేస్తున్న తీరు చూసినా ఈ విషయం అర్థమవుతుంది.
ఇది రాజమౌళి బంధువు శశాంక్ యేలేటి డైరెక్ట్ చేస్తున్న సినిమా. ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నదేమో.. రాజమౌళి, రమల తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ, ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ. దీంతో దీని ప్రమోషన్ కోసం రాజమౌళి, రమ, కీరవాణి.. ఇలా చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ దిగిపోయారు. ఓవైపు ‘వారణాసి’ పనుల్లో రాజమౌళి సహా అందరూ తలమునకలై ఉన్నా సరే.. అక్టోబరు 2న రిలీజయ్యే ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ కోసం రంగంలోకి దిగింది.
అందరూ కలిసి వినాయక చవితి నవరాత్రుల నేపథ్యంలో ఒక ఇంట్రెసింగ్ ప్రమోషనల్ వీడియో చేశారు. అది చాలా సరదాగా సాగింది. ఇందులో రాజమౌళి కూడా ఇన్వాల్వ్ అయి ఈ వీడియోకు అవసరమైన రీచ్ తీసుకొచ్చాడు.
ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. మామూలుగా చాలా రిజర్వ్‌గా ఉండే, మలయాళంలో తన సినిమాలను కూడా పెద్దగా ప్రమోట్ చేయని ఫహద్ ఫాజిల్ ఈ సినిమా కోసం చాలా హుషారుగా ప్రమోషన్లు చేస్తున్నారు. లేటెస్ట్ ప్రమోషనల్ వీడియోలో అతను చాలా హుషారుగా, సరదాగా ఇన్వాల్వ్ అయిన తీరు చూసి.. ఎప్పుడూ చాలా సీరియస్‌గా కనిపించే ఫహద్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.
This post was last modified on September 21, 2026 5:53 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…