Movie News

కొంచెం చూసుకుని రావయ్యా మేస్త్రి

ఇంకో పదకొండు రోజుల్లో చిరంజీవి పుట్టినరోజు రానుంది. ఈసారి అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. మెగా 158 టీజర్ ఉంటుందని ఆల్రెడీ తమన్, బాబీ చూచాయగా చెప్పేయడంతో దాని మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు. విశ్వంభర విడుదల తేదీ అనౌన్స్ మెంట్ ఉంటుందని మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న మాట. అక్టోబర్ 16 లాక్ అయ్యిందట. అయితే యువి క్రియేషన్స్ అఫీషియల్ గా చెప్పేవరకు ఏదీ నమ్మలేని పరిస్థితి నెలకొంది.

ఇక అసలు విషయానికి వస్తే ఆగస్ట్ 21 ముఠామేస్త్రిని రీ రిలీజ్ చేయబోతున్నారు. 1993లో విడుదలైన ఈ సూపర్ హిట్ మూవీ అప్పట్లో కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేసుకున్నా ఏవో కారణాల వల్ల పండగ అయిపోయిన నాలుగు రోజుల తర్వాత థియేటర్లకు తీసుకొచ్చారు. మెగాస్టార్ రాజకీయ రంగప్రవేశం గురించి జోరుగా ప్రచారం జరుగుతున్న టైంలో ముఠామేస్త్రిలో హీరో పాత్రని ఎమ్మెల్యే, మంత్రిని చేయడం అప్పట్లో టాక్ అఫ్ ది టౌన్ అయ్యింది.

ఇదంతా బాగానే ఉంది కానీ సరైన ప్లానింగ్ చేసుకుని ఇలాంటి కల్ట్ మూవీస్ ని రీ రిలీజ్ చేసే విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ఘరానా మొగుడు, జగదేకవీరుడు అతిలోసుందరి, గ్యాంగ్ లీడర్ పునఃవిడుదల చేసినప్పుడు క్వాలిటీని నిర్లక్ష్యం చేశారు. ఒరిజినల్ ప్రింట్లు అందుబాటులో లేకపోవడం లాంటి కారణాలు అసంతృప్తికి దారి తీశాయి. కొదమసింహం లాంటి యావరేజ్ మూవీని బాగా 4కె చేశారు కానీ బ్లాక్ బస్టర్స్ కి ఆ భాగ్యం దక్కలేదు.

ముఠామేస్త్రి ఈ విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా చూసుకోవాలి. ఆగస్ట్ 22 శంకర్ దాదా ఎంబిబిఎస్ కూడా వస్తోంది కానీ అది ఇంతకు ముందు ఒకసారి రీ రిలీజ్ అయ్యింది కాబట్టి మెగా ఫాన్స్ ముఠామేస్త్రికి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఈ సినిమాలో నటించిన మీనా, రోజా, బ్రహ్మానందం, బాబు మోహన్, శరత్ సక్సేనా, మన్సూర్ అలీఖాన్ మొదలైనవాళ్లంతా అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళతో వీడియో బైట్స్, ఈవెంట్స్ లాంటివి ప్లాన్ చేస్తే బాగుంటుందేమో.  

This post was last modified on August 11, 2026 1:51 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

3 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

4 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

5 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

7 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

9 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

10 hours ago