Movie News

ఆదర్శ కుటుంబం… ఎన్నాళ్లీ ఆట?

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు ముందు ప్రకటించిన రిలీజ్ డేట్ అక్టోబరు 2. కానీ ఈ తేదీకి సినిమా రిలీజ్ కాదని కొన్ని వారాల ముందే ఇండస్ట్రీ జనాలకు స్పష్టత వచ్చేసింది. ‘ది ప్యారడైజ్’ సినిమాను సెప్టెంబరు 24కే ఫిక్స్ చేయడం కోసం.. ఆ సినిమా వాయిదా పడితే తమతో పాటు చాలా సినిమాలకు ఇబ్బంది ఎదురవుతుంది కాబట్టి.. ‘ఆదర్శ కుటుంబం’ మేకర్స్ కావాలనే అక్టోబరు 2కు రిలీజ్ డేట్ ఇచ్చారు.

ఒక దశలో వాయిదా గురించి గట్టిగా ఆలోచించిన ‘ది ప్యారడైజ్’ టీం.. ‘ఆదర్శ కుటుంబం’ మేకర్స్ వేసిన ఎత్తుగడతో తప్పక 24నే వస్తోంది. ఆ సినిమాకు బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. రిలీజ్ దిశగా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇప్పటికైనా ‘ఆదర్శ కుటుంబం’ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించవచ్చు కదా. కానీ ఈ సినిమా మేకర్స్ మాత్రం.. ఇన్నాళ్లూ ఆడిన గేమ్‌ను కొనసాగిస్తున్నారు.

‘ఆదర్శ కుటుంబం’ నుంచి ఈ రోజు ఫస్ట్ సింగిల్‌ అప్‌డేట్ ఇచ్చారు. ‘నారాయణమ్మ’ అంటూ సాగే పాటను ఈ నెల 22న లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఈ పోస్టర్ మీద మళ్లీ అక్టోబరు 2 రిలీజ్ డేట్ అని వేశారు. ఇంకో పది రోజుల్లో రిలీజ్ పెట్టుకుని ఇప్పుడు ఫస్ట్ సింగిల్ లాంచ్ చేస్తారంటే జనాలు నమ్మేస్తారా?

‘ఆదర్శ కుటుంబం’ అక్టోబరు 2న రాదన్న క్లారిటీతో సిగ్మా, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, తెల్లకాగితం, అనకాపల్లి.. ఇలా బోలెడు సినిమాలు ఆ డేట్ తీసుకున్నాయి. అయినా ‘ఆదర్శ కుటుంబం’ కొత్త డేట్ ప్రకటించకుండా ఇంకా తన ఆటను కొనసాగిస్తోంది. ఈ సినిమా అక్టోబరు 9కి వాయిదా పడుతుందని ఇండస్ట్రీలో, మీడియాలో అందరికీ క్లారిటీ ఉంది.

అయినా ఇంకా జనాలను మభ్యపెట్టేలా అక్టోబరు 2 రిలీజ్ డేట్‌తో పోస్టర్లు ఎందుకు దించుతున్నారో మరి? ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన ‘‘ఫ్లడ్ లైట్లు వేసిన స్టేడియంలో దొంగా పోలీస్ ఆడుతున్న’’ డైలాగ్‌ను గుర్తు చేసేలా ఉందీ వ్యవహారం.

This post was last modified on September 21, 2026 9:14 pm

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

23 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago