Movie News

కాయదు వచ్చింది… కళ తెచ్చింది

ఒక పెద్ద సినిమా రిలీజవుతుంటే.. అందులో మెయిన్ కాస్ట్ అండ్ క్రూలో ప్రతి ఒక్కరూ కొంచెం ముందో వెనుకో మీడియా ముందుకు రావాల్సిందే. ముఖ్యంగా హీరో హీరోయిన్లయితే కచ్చితంగా సినిమాను ప్రమోట్ చేయాల్సిందే. కానీ వరుసగా రెండు మూడు ఈవెంట్లలో హీరోయిన్ కనిపించలేదంటే జనాలకు రకరకాల డౌట్లు వచ్చేస్తాయి.

సినిమాలో తన పాత్రను తగ్గించేశారా.. పారితోషకం ఏమైనా పెండింగ్ పెట్టారా? లేక టీంలో ఎవరైనా తనను హర్ట్ చేశారా అంటూ గుసగుసలాడుకోవడం మొదలుపెడతారు. ‘ది ప్యారడైజ్’ సినిమా హీరోయిన్ కాయదు లోహర్ విషయంలోనూ ఇదే జరిగింది.

నాని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోచి.. ఇలా వివిధ నగరాల్లో ‘ది ప్యారడైజ్’ ప్రెస్ మీట్లకు హాజరయ్యాడు. ఎక్కడా కాయదు లోహర్ కనిపించకపోవడంతో సందేహాలు మొదలయ్యాయి. చెన్నై ఈవెంట్లో కాయదు గురించి అడిగితే.. ఆమె మారి సెల్వరాజ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉందన్నాడు. కానీ తన కెరీర్లో ఇప్పటిదాకా అతి పెద్ద సినిమా రిలీజవుతుంటే.. కాయదు ప్రమోషన్లలో భాగం కాకపోవడం మాత్రం ఆశ్చర్యంగానే అనిపించింది.

వేరే సినిమాల షూటింగ్స్ పక్కన పెట్టి అయినా ప్రమోషన్లకు రావాలి కదా అనిపించింది. తన చివరి చిత్రం ‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్లకు కూడా కాయదు రాకపోవడం చర్చనీయాంశం అయిన నేపథ్యంలో ఆమె యాటిట్యూడ్ మీదా చర్చ జరిగింది.

ఐతే ఈ చర్చకు తెరదించుతూ కాయదు ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లకు వచ్చేసింది. సోమవారం ఆమె తెలుగు మీడియా ముందుకు వచ్చింది. ‘ది ప్యారడైజ్’ గురించి ఇంటర్వ్యూలు ఇస్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలో ట్రెండింగ్ హీరోయిన్లలో ఒకరైన కాయదు.. ఎట్టకేలకు అందుబాటులోకి రావడంతో ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లకు మంచి బూస్ట్ వచ్చినట్లయింది.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ డే అండ్ నైట్ సినిమా కోసం కష్టపడుతుండడంతో ప్రమోషన్లను నాని ఒక్కడే ముందుండి నడిపించాల్సి వచ్చింది. ఇప్పుడు కాయదు కూడా అందుకోవడంతో నేచురల్ స్టార్ మీద భారం తగ్గినట్లే.

This post was last modified on September 21, 2026 5:51 pm

Share

Recent Posts

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

18 minutes ago

రిజర్వేషన్ లెక్కలు… ఎవరెవరికి ఎన్ని? ఎక్కడ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…

2 hours ago

ఈవీఎంల వల్లే జగన్ ఓడారు: తెలంగాణ మంత్రి

2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…

3 hours ago

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

5 hours ago

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

8 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

8 hours ago