గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా వేతనాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద టాస్క్ అయిపొయింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఈ సమస్య ఎక్కువగా ఉండేది. అది ఉద్యోగులలో అసంతృప్తికి దారి తీసింది. ఉద్యోగులలో వున్న అసంతృప్తిని చంద్రబాబు చక్కగా క్యాచ్ చేసుకున్నారు. మేము అధికారంలోకి వస్తే క్రమం తప్పకుండా జీతాలు చెల్లిస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దాంతో గంపగుత్తగా ఉద్యోగులు కూటమి వైపు మొగ్గు చూపారు.
కూటమి పాలనలో కూడా అంతే….
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించారు. ఏడాది తర్వాత కొన్ని శాఖల ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కావడం మొదలైంది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెండింగ్ పడుతున్నాయన్న మాట వినిపించింది.
స్కీం వర్కర్ల వేతనాలు కూడా నెలల తరబడి నిలిచిపోవడంతో ఉద్యోగులు నిరసనలకు దిగడం, ఆందోళనలు చేయడం మొదలైంది. ఈ క్రమంలో ఉద్యోగులు, ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను చల్లార్చేందుకు ఫీల్ గుడ్ రాజకీయాలు స్టార్ట్ చేశారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా జీతం ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఆర్ధిక శాఖ ద్వారా కీలక ఆదేశాలు…
ప్రతి ఉద్యోగికి 1వ తేదీ రోజునే జీతం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ ద్వారా అన్నీ శాఖలకు మెమో జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలన్ని జీతాల బిల్లును వెంటనే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ లో అప్ డేట్ చేయాలని ఆదేశించింది. జీతాల బిల్లు సకాలంలో అప్ డేట్ చేయకపోతే డ్రాయింగ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ (డిడిఓ)చర్యలు తీసుకోవాలని ఆయా శాఖాధిపతులకు ఆదేశాలిచ్చింది. నెల చివరికల్లా ఉద్యోగుల జీతాల బిల్లులు సమర్పించకపోతే డిడిఓలు బాధ్యత వహించాలని హెచ్చరించడంతో డిడిఓలు పరుగులు పెడుతున్నారు.
శాఖాధిపతులపై భారం…
రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత పథకాల్లో లక్ష మందికి పైగా పని చేస్తున్నారు. వారి జీతాల బాధ్యత ఆయా శాఖాధిపతుల మీద వేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలకు సంబందించిన నిధులను కేంద్రం నుంచి విడుదల చేయించే బాధ్యత శాఖాధిపతులే చూసుకోవాలని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోవడమేనని ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకు ఏ నెలకా నెల జీతాలు చెల్లించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి.
This post was last modified on July 29, 2026 10:52 pm
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…