Movie News

దేశముదురు చేయకపోవడమే మంచిదైంది

ఫిలిం ఇండస్ట్రీలో ఒక కథ వేర్వేరు చోట్లకు ప్రయాణించి.. చివరగా ఒక హీరో దగ్గర ఓకే అయి పట్టాలెక్కడం చాలా సినిమాల విషయంలో జరిగింది. ఇప్పటికీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఐతే ఒక హీరో వదులుకున్న సినిమా చాలా పెద్ద హిట్టయితే కచ్చితంగా బాధ ఉంటుంది. అక్కినేని కుటుంబ కథానాయకుడు సుమంత్‌ కూడా ఇలా రెండు కథలు వదులుకున్నాడట. ఆ రెంటిలో ఒక సినిమా విషయంలో ఇప్పటికీ బాధ ఉందని, కానీ ఇంకో చిత్రం విషయంలో ఎలాంటి రిగ్రెట్స్ లేవని అంటున్నాడు సుమంత్.

తరుణ్ హీరోగా పరిచయం అయిన ‘నువ్వే కావాలి’ సినిమాను తనే చేయాల్సిందని సుమంత్ తెలిపాడు. ఐతే ఆ టైంలో ఒకేసారి యువకుడు, పెళ్ళిసంబంధం సినిమాలు చేస్తుండడంతో డేట్లు సర్దుబాటు చేయలేక ‘నువ్వే కావాలి’ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని సుమంత్ తెలిపాడు.

ఆ సినిమా మిస్ అయినందుకు ఇప్పటికీ బాధ పడుతుంటానని చెప్పాడు. ‘నువ్వే కావాలి’ సినిమా అప్పట్లో మామూలు సంచలనం కాదు. తెలుగు ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద విజయం సాధించిన లవ్ స్టోరీ అదే అంటే అతిశయోక్తి కాదు.

ఇక సుమంత్ వదులుకున్న మరో చిత్రం.. దేశముదురు అట. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఐతే ముందు ఈ కథను పూరి తనకే చెప్పాడని, కొన్ని కారణాల వల్ల ఆ మూవీ చేయలేకపోయానని సుమంత్ తెలిపాడు. కానీ ఈ సినిమా తాను చేస్తే అంత పెద్ద హిట్టయ్యేది కాదని అతను నిర్మొహమాటంగా చెప్పడం విశేషం. అల్లు అర్జున్‌కే అది కరెక్ట్ అని, అతను చేయడం వల్లే అంత పెద్ద హిట్టయిందని అన్నాడు. కొంచెం సాత్వికంగా ఉండే పాత్రలే చేసే సుమంత్‌.. ‘దేశముదురు’ సినిమాకు సెట్ అయ్యేవాడు కాదని ఎవ్వరైనా ఒప్పుకుంటారు.

This post was last modified on July 29, 2026 7:51 pm

Share

Recent Posts

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

12 minutes ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

29 minutes ago

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

2 hours ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

4 hours ago

ఎన్టీఆర్… ఇలాగే ఉండాలి

తన చేతికి గాయం అయింది సర్జరీ చేసుకుంటున్నా అంటూ కొన్ని నెలల ముందు షాకింగ్ అప్‌డేట్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు…

4 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

5 hours ago