ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉదయ్ పై కేసు నమోదు కాగా…ఆ తర్వాత ఆయన నాటకీయ పరిణామాల మధ్య ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనం రేపింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఉదయ్ తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయారు. దీంతో, రెండ్రోజులుగా పోలీసులు ఉదయ్ కోసం గాలిస్తున్నారు.
అయితే, తానెక్కడికీ పారిపోలేదని, తన నాయనమ్మ ఆరోగ్యం బాగోలేకపోతే పలకరించేందుకు తమ స్వగ్రామం ఊళ్లపాలెం వెళ్లానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఉదయ్ ను మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేసి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించబోతున్నారు.
హైదరాబాద్ కు తరలించిన తర్వాత బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. ఆ తర్వాత మరిన్ని సెక్షన్ల కింద ఉదయ్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేసే అవకాశముందని తెలుస్తోంది. తనను లైంగికంగా వేధించడంతో పాటు బ్లాక్ మెయిల్ చేశారని బాధితురాలు సంచలన ఆరోపణలు చేశారు.
అయితే, ఆ ఆరోపణలు అవాస్తవమని ఉదయ్ కొట్టిపారేశారు. కానీ, ప్రాథమిక విచారణ అనంతరం ఉదయ్ పై ఈ నెల 18న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు ఉదయ్ ను ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై ఉదయ్ కోర్టును ఆశ్రయించగా అక్కడ ఆయనకు చుక్కెదురైన సంగతి తెలిసిందే.
This post was last modified on July 28, 2026 7:13 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…