టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. సోమవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సమయంలో ఆయనకు నిరసనగా అంగన్‌వాడీ కార్యకర్తలు.. రహదారులపై వచ్చారని, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారని వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇదంతా.. తల్లికి వందనం నిధుల గురించేనని కూడా వైసీపీ నాయకులు వ్యాఖ్యానించారు.
గత ఎన్నికలకు ముందు వైసీపీ అమ్మ ఒడి పథకం అమలు చేసిందని.. ఆ సమయంలో పాదయాత్ర చేసిన నారా లోకేష్.. అంగన్‌వాడీ కార్యకర్తలకు కూడా తాము వచ్చాక తల్లికి వందనం పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. కానీ, తాజాగా తల్లికి వందనం పథకంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు సొమ్ములు ఇవ్వలేదని ఆరోపించారు. అందుకే పెనమలూరు పర్యటనలో మహిళలు రోడ్డెక్కారని వైసీపీ నాయకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ స్పందించారు. అన్యాయం చేసింది తాము కాదని.. వైసీపీనేనని ఆయన ఆరోపించారు.
వైసీపీ హయాంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు అమ్మఒడి ఇవ్వకుండా అన్యాయం చేసింది గొడ్డలి పార్టీ. కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీలకు తల్లికి వందనం పథకం వర్తింపజేయడంతో సంతోషంతో వారు నా పెనమలూరు నియోజకవర్గ పర్యటనలో కృతజ్ఞతలు తెలిపారు. గొడ్డలిపోటును గుండెపోటుగా ప్రచారం చేసిన గొడ్డలి పార్టీ… అంగన్‌వాడీల ఈ కృతజ్ఞత ర్యాలీని, నిరసన ర్యాలీ అంటూ విష ప్రచారం చేస్తోంది. అని ఎద్దేవా చేశారు.
అడ్డంగా బుక్కయిన వైసీపీ
వాస్తవానికి పెనమలూరులో ఏం జరిగిందన్న విషయం ఆసక్తిగా మారింది. అంగన్‌వాడీ కార్యకర్తలు ప్లకార్డులు పెట్టుకుని రోడ్లపై ఉన్న మాట నిజం. అయితే.. అది తల్లికి వందనం నిధులు జమ కోసం కాదు. ఎందుకంటే.. అప్పటికే ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇచ్చి అంగన్‌వాడీ కార్యకర్తల పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నట్టు స్పష్టం చేసింది.
కానీ.. పెనమలూరులో మహిళలు.. తమ వేతనాలు పెంచాలని.. గత 5 ఏళ్లలో తమ వేతనాలు పెరగలేదని చెప్పేందుకు వచ్చారు. అయితే.. ఈ విషయం వైసీపీ వేరే కోణంలో చూపించి.. విమర్శల దాడి చేసి బుక్కయిపోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
