యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో ఉన్నాయి. నాగశౌర్య లాంటి టాలెంట్, బ్యాకప్ రెండు ఉన్న హీరో సైతం తీవ్రమైన బ్యాడ్ ఫేజ్ చూడడానికి కారణం నిర్మాతలు రాకపోవడం కాదు. ఎంపికలో చేస్తున్న దారుణమైన పొరపాట్లు పెద్ద మూల్యాన్ని చెల్లించేలా చేస్తున్నాయి. అందుకే తేజ సజ్జ చాలా ఆచితూచి అడుగులు వేస్తూ నిదానమే ప్రధానం సూత్రాన్ని పాటిస్తున్నాడు.
జాంబీ రెడ్డి హిట్టయ్యింది. కాని ఎక్కువ పేరు ప్రశాంత్ వర్మకు వచ్చింది. అదే దర్శకుడు వందల కోట్లు వసూలు చేసిన హనుమాన్ ఇచ్చాడు. దెబ్బకు తేజ సజ్జ మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. లక్కీగా మిరాయ్ లాంటి ఫాంటసీ మూవీ జనాలకు బాగా నచ్చేసి ఇది కూడా 100 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకుందామని తేజ తాపత్రయపడలేదు. అందుకే మిరాయ్ 2కి టైం పట్టినా దాని కోసం ఎదురు చూశాడు. ఆల్రెడీ షూటింగ్ శరవేగంగా జరిగిపోతోంది.
జాంబీ రెడ్డి సీక్వెల్ కు ఎస్ చెప్పడం ద్వారా ఈసారి ప్యాన్ ఇండియా స్థాయిలో మరింత బలమైన టార్గెట్ పెట్టుకున్నాడు. ఇక్కడితో ఆగకుండా అమెజాన్ ప్రైమ్ కోసం ది ట్రైటర్స్ అనే రియాలిటీ షో చేశాడు. అక్టోబర్ పదిహేను నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇరవై మంది సెలబ్రిటీలను ఒక చోట చేర్చి ఆడించే బిగ్ బాస్ తరహా ఆట ఇది. ఫార్మాట్, రౌండ్స్ అన్నీ వేర్వేరుగా, డిఫరెంట్ గా ఉంటాయి. మనిషి మొహం వెనుక అసలు మొహం అనే కాన్సెప్ట్ తో దీన్ని వెరైటీగా డిజైన్ చేశారు.
ఇది కనక క్లిక్ అయితే యాంకర్ గా మరో సమాంతర కెరీర్ తయారవుతుంది. నిజానికి తేజ సజ్జ కోసం చాలా మంది దర్శకులు న్యూ ఏజ్ లవ్ స్టోరీస్, థ్రిల్లర్స్ తీసుకొచ్చారు. కానీ వాటిలో ఒక్కదాన్ని కూడా ఒప్పుకోలేదు. అవి ఇచ్చే తాత్కాలిక మార్కెట్ కన్నా తేజ పెద్ద గోల్స్ పెట్టుకున్నాడు. అయితే ఎంతసేపూ ప్యాన్ ఇండియా గ్రాండియర్లే కాకుండా లైట్ ఎంటర్ టైనర్లు కూడా చేయడం అవసరం. చూస్తుంటే తేజ సజ్జకు ఇప్పుడప్పుడే వాటి మీద దృష్టి సారించే ఆలోచన ఉన్నట్టు కనిపించడం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
