కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు చేయాలన్నది ఒక విధానం అయితే.. మరొకటి రాజకీయంగా ఓటు బ్యాంకును పెంచుకునే వ్యూహం కూడా దీనిలో ఉంది. ప్రస్తుతం కొత్త పింఛన్లను ఖరారు చేసే పనిలో ఉన్న సర్కారు.. మరోవైపు ఓట్ల లెక్కలు కూడా వేసుకుంటోంది. ఇది తప్పేమీ కాదు. ప్రభుత్వాలు ఏం చేసినా.. అంతిమంగా ఓటు బ్యాంకును స్థిరీకరించు కునేందుకు మళ్లీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకే!.
మొత్తంగా పింఛన్ల వ్యవహారంలో కూటమికి ప్లస్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో జగన్ పింఛన్లను 2000 నుంచి 3 వేలకు పెంచారు. అయితే.. అది ఐదేళ్లపాటు సాగింది. వెయ్యిరూపాయల పింఛను పెంచేందుకు ఐదేళ్ల కాలం తీసుకున్నారు. కానీ, కూటమి వస్తూ వస్తూనే ఒకేసారి రూ.1000ని పెంచేసి.. పింఛను దారుల మొహాల్లో ఆనందం నింపింది. ఈ ఉత్సాహం ఇప్పటికీ.. కనిపిస్తోంది. నెల నెలా ఇంటికే పింఛన్లు పంపిస్తున్నామన్న వైసీపీ ఇమేజ్‌ను కూడా కూటమి సొంతం చేసుకుంది.
అయితే.. ఇప్పుడు వలంటీర్లు లేకపోయినా.. కూటమి సర్కారు కూడా ఇంటికే పింఛన్లు పంపిణీ చేస్తోంది. మొత్తంగా ఈ వ్యూహం సక్సెస్ అయింది. అయితే.. ఇప్పుడు పింఛన్లు రాలేదన్న అర్హులు కొంత ఆవేదనలో ఉన్నారు. గత నాలుగేళ్ల కాలంలో కొత్తగా పించన్లు రాసింది లేదు. దీంతో కూటమి సర్కారుపైనే లబ్ధిదారులు, అర్హులు కూడా ఆశలు పెట్టుకున్నారు. కానీ, రెండున్నరేళ్లు అవుతున్నా.. వారి సమస్యలు పరిష్కారం కాలేదు. ఇది ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో చంద్రబాబు చొరవ తీసుకుని కొత్తవారికి పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు.
ఇవి లక్షా 40 వేల వరకు తేలాయి. అంటే.. ప్రస్తుతం ఇస్తున్న 60 లక్షల మందికి వీరు తోడయ్యారు. వీరిలో వితంతువులు ఎక్కువగా ఉన్నారని అంటే.. మహిళలు.. ఎక్కువగా ఉన్నారన అధికారులు తేల్చారు. వీరందరికి పించన్లు అందనున్నాయి. అలానే వృద్ధులు, దివ్యాంగులకు కూడా పించన్లను కొత్తగా రాయనున్నారు. దీంతో ఇప్పటి వరకు పింఛను విషయంలో అసంతృప్తితో ఉన్న వారంతా.. కూటమివైపు సానుకూలంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు.. ఇది కూటమికి బలమైన ఓటు బ్యాంకుగా కూడా మారనుంది. ఇక, వచ్చే 2029 నాటికి.. ఈ పించనును మరో వెయ్యి పెంచే యోచనలో కూడా చంద్రబాబు ఉన్నట్టు పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
