Political News

ష‌ర్మిల‌ కు నొప్పి లేకుండా… కాంగ్రెస్ ఆప‌రేష‌న్‌!

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. 2024లో పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన ష‌ర్మిల‌పై పార్టీ అధిష్టానం భారీగానే ఆశ‌లు పెట్టుకుంది. ఆమెతో పార్టీ పుంజుకుంటుంద‌ని.. ఏపీలో విభ‌జ‌న కార‌ణంగా కోల్పోయిన ప్రాభవం.. పెరుగుతుంద‌ని అంచ‌నా వేసుకుంది. అయితే.. కారణాలు ఏవైనా కూడా ష‌ర్మిల పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టి దాదాపు రెండున్న‌రేళ్లు పూర్తయిన త‌ర్వాత‌ కూడా పార్టీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేక పోయింది. పైగా అంత‌ర్గ‌త‌ కుమ్ములాటలు మ‌రింత పెరిగాయి. అంతేకాదు..ష‌ర్మిల‌కు వ్య‌తిరేకంగా పార్టీ సీనియ‌ర్లు అధిష్టానానికి లేఖ‌లు సంధించారు.

ఇవ‌న్నీ గ‌తం. ఇక‌, ప్ర‌స్తుత విష‌యానికి వ‌స్తే.. ష‌ర్మిల తీవ్ర ఆవేద‌న‌లో ఉన్నారు. తెలంగాణ‌లో తాను సొంతంగా పెట్టుకున్న పార్టీని కూడా విలీనం చేసి.. కాంగ్రెస్‌లో చేరాన‌ని.. అయినా త‌న‌కు ఆ స‌మ‌యంలో ఇచ్చిన హామీని ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర్చలేద‌ని ఆమె వాపోతున్నారు. కొన్నాళ్ల‌కింద‌ట‌.. క‌ర్ణాట‌క కోటాలో రాజ్య‌స‌భ‌కు ఆమెను పంపిస్తున్నార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో త‌న భ‌ర్త అనిల్‌తో క‌లిసి ఆమె ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీ, మ‌ల్లికార్జున ఖ‌ర్గేల‌తో భేటీ అయ్యారు. ఆ స‌మ‌యంలోనే ఇక‌, రాజ్య‌స‌భ సీటు ఆమెకు క‌న్ఫ‌ర్మ్ అయింద‌ని అంద‌రూ భావించారు. కానీ, ఈ విష‌యంలో పార్టీ యూట‌ర్న్ తీసుకుంది.

ఫ‌లితంగా ష‌ర్మిల‌కు చేతిదాకా అందివ‌చ్చిన రాజ్య‌స‌భ సీటు చేజారిపోయింది. ఇక‌, అప్ప‌టి నుంచి ష‌ర్మిల మౌనంగానే ఉన్నారు. ఏపీలో పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాల‌కు కూడా హాజ‌రు కావ‌డంలేదు. కేవ‌లం ఒక‌టి రెండు ప్ర‌స్‌నోట్ల‌కే ఆమె ప‌రిమితం అయ్యారు. దీంతో ఆమె వ్య‌వ‌హారం మ‌రోసారిచ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ప్ర‌త్యేక దృష్టిపెట్టిన కాంగ్రెస్‌.. ఏపీలో పార్టీ విస్త‌ర‌ణ‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. క‌ర్ణాట‌క ప్ర‌స్తుత సీఎం డీకే శివ‌కుమార్ అన‌ధికార ఏపీ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ద్వారా.. ష‌ర్మిల‌ను త‌ప్పించే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా సాగుతున్నాయ‌ని తెలిసింది.

సుతిమెత్త‌గానే ష‌ర్మిల‌ను ప‌క్క‌కు త‌ప్పించి.. ఆమె చూస్తున్న ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను బీసీ మ‌హిళ‌కు అప్ప‌గించాల‌ని పార్టీ అధిష్టానం ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. అయితే.. ష‌ర్మిల‌ను పూర్తిగా త‌ప్పించినా.. కేంద్ర కార్య‌వ‌ర్గంలో ఆమెకుచోటు క‌ల్పించే అంశాన్ని పార్టీ సీరియ‌స్‌గా ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. సో.. మొత్తంగా ష‌ర్మిల‌ను ఏపీ ప‌గ్గాల నుంచి త‌ప్పించ‌డం ఖాయ‌మ‌ని.. అదేస‌మయంలో పార్టీ కేంద్ర కార్య‌వ‌ర్గంలో ఆమెకు అవ‌కాశం క‌ల్పిస్తార‌ని ఏపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత ఆఫ్‌ది రికార్డుగా వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. సో.. దీనిని బ‌ట్టి.. ష‌ర్మిల‌కు నొప్పి లేకుండా.. కాంగ్రెస్ ఆప‌రేష‌న్‌ చేప‌ట్టింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రి దీనిపై ష‌ర్మిల ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on July 21, 2026 8:17 am

Share

Recent Posts

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

40 minutes ago

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

3 hours ago

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…

4 hours ago

కుబేర తర్వాత కమ్ముల ఏమయ్యారు

టాలీవుడ్ దర్శకుల్లో శేఖర్ కమ్ములకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కమర్షియల్ లెక్కలకు దూరంగా సెన్సిబుల్ కథలతో ఫ్యామిలీ ఆడియన్స్,…

5 hours ago

విశ్వనాథ్ వసూళ్లకు కుటుంబాలే కీలకం

ఇండిపెండెన్స్ డేకి ఒక రోజు ముందు ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ఎంత డబ్బింగ్ సినిమా…

5 hours ago

తెలివిగా ‘గేమ్’ తప్పించుకున్న దుల్కర్

పెద్ద సినిమాలకు షూటింగ్ పూర్తి చేయడమే కాదు సరైన రిలీజ్ డేట్లు సెట్ చేసుకోవడం చాలా పెద్ద ఛాలెంజ్. ఈ…

6 hours ago