Political News

బాబు కు అవకాశం ఉన్నా అహంకారం ఉండదు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును ప‌లువురు కేంద్ర మంత్రులు కొనియాడారు. పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల సంద‌ర్భంగా లోక్‌స‌భ వాయిదా ప‌డిన నేప‌థ్యంలో టీడీపీ ఎంపీలు కొంద‌రు కేంద్ర మంత్రుల‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సీఎం బాబు ఏపీలో ఆక్వా రంగాన్ని ఆదుకోవాల‌ని, రొయ్య‌ల మేత విష‌యంలో రైతుల‌కు స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ముగ్గురు కేంద్ర మంత్రుల‌కు వేర్వేరుగా లేఖ‌లు రాశారు. ఈ లేఖ‌ల‌ను ఆయా శాఖ‌ల మంత్రుల‌కు ఈ-మెయిల్ రూపంలో పంపించారు.

అదేవిధంగా లేఖ‌ల హార్డ్ కాపీల‌ను టీడీపీ ఎంపీలు స‌ద‌రు మంత్రుల‌ను క‌లిసి సోమ‌వారం మ‌రోసారి అందించారు. ఏపీలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను వారు ప్ర‌స్తావించారు. కేంద్రం నుంచి త‌క్ష‌ణ సాయం ప్ర‌క‌టించాల‌ని సీఎం చంద్ర‌బాబు త‌ర‌ఫున కోరుతున్నామ‌ని వారు తెలిపారు. రాష్ట్రంలో ఆక్వా కల్చర్, మత్స్య, పొగాకు రంగాల అభివృద్ధికి సహకారం అందించాల ని విన్న‌వించారు. రైతులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు బ్లూ ఎకానమీకి కేంద్రంగా ఉన్న ఏపీని అభివృద్ధి చేసేందుకు స‌హ‌క‌రించాల‌ని విన్న‌వించారు.

ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రులు సీఎం చంద్ర‌బాబును కొనియాడారు. కేంద్ర ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉంటూనే.. ఎలాంటి డిమాండ్లు చేయ‌కుండా స‌మ‌స్య‌ల‌పై లేఖ‌లు రాయ‌డాన్నివారు స్వాగ‌తించారు. చంద్ర‌బాబు దూర‌దృష్టి అద్భుతం అంటూ ప‌రిశ్ర‌మ‌ల శాఖ కార్య‌ద‌ర్శి వ్యాఖ్యానించారు. అదేవిధంగా మ‌త్స్య‌శాఖ వ‌ర్గాలు కూడా ఇదే విష‌యాన్ని పేర్కొన్నారు. చంద్ర‌బాబు లేఖ‌లు అందాయ‌ని.. వాటిని ప‌రిశీలిస్తున్నామ‌ని తెలిపారు. త‌ప్ప‌కుండా సాయం అందేలా చూస్తామ‌ని వారు హామీ ఇచ్చిన‌ట్టు ఎంపీలు తెలిపారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా చేయ‌నున్నార‌ని వెల్ల‌డించారు.

గ‌తానికి భిన్నంగా..

ప్ర‌స్తుతం కేంద్రంలో ఏర్ప‌డిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌ర్కారుకు సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని టీడీపీ బ‌ల‌మైన మ‌ద్ద‌తు ఇస్తోంది. అదేవిధంగా బీహార్‌కు చెందిన జేడీయూ కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. వీరిద్ద‌రి మ‌ద్ద‌తుతోనే మోడీ స‌ర్కారు నిర్వి ఘ్నంగా మూడోసారి ప‌వ‌ర్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు కోరిన మేర‌కు కేంద్రం ఏదైనా చేయాల్సి ఉంటుంది. ఆయ‌న చెప్పింది అంగీక‌రించాల్సి కూడా ఉంటుంది. అయితే.. బాబు గ‌త రెండు సంవ‌త్స‌రాల కాలంలో ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా.. కేంద్రంపై పెత్త‌నం చేసే ధోర‌ణిలో ఎప్పుడూ వ్య‌వ‌హ‌రించ‌లేదు. త‌న అవ‌స‌ర‌మే అయినా.. ఆయ‌న లేఖ‌ల‌తోనే విజ్ఞ‌ప్తులు పంపుతున్నారు. ఇదే విష‌యాన్ని తాజాగా కేంద్ర మంత్రులు ప్ర‌శంసించారు.

This post was last modified on July 21, 2026 8:40 am

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

1 hour ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

3 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

4 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

12 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago