Movie News

మమిత పేరు మార్మోగ‌బోతోంది

ప్రేమ‌లు సినిమాతో మమిత బైజు అనే అమ్మాయి ఎంత పాపుల‌ర్ అయిందో తెలిసిందే. అప్ప‌టికే మ‌ల‌యాళంలో కొన్ని సినిమాల్లో న‌టించినా.. ఆమెకు అంత‌గా గుర్తింపు రాలేదు. కానీ ప్రేమ‌లు మ‌లయాళంలో స‌ర్ప్రైజ్ హిట్ కావ‌డ‌మే కాక‌.. త‌ర్వాత తెలుగులో డ‌బ్ చేసి రిలీజ్ చేస్తే ఇక్క‌డా విజ‌య‌వంత‌మైంది. గొప్ప అంద‌గ‌త్తె కాక‌పోయినా.. త‌న క్యూట్ లుక్స్‌, ఎక్స్‌ప్రెష‌న్స్, చ‌లాకీత‌నంతో ఆమె కుర్రాళ్ల‌ను క‌ట్టి ప‌డేసింది.

డ్యూడ్ సినిమాతో ఇంకో పెద్ద హిట్ కొట్ట‌డం.. అందులోనూ అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకోవ‌డంతో మమితకు ఇంకా క్రేజ్ పెరిగింది. అవ‌కాశాలు వ‌రుస క‌ట్టాయి. ఇప్పుడు ఆమె క్రేజ్ డ‌బుల‌య్యే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. వ‌చ్చే నెల రోజుల్లో మామిత పేరు సౌత్ ఇండియన్ సినిమాలో మార్మోగ‌బోతోంది.

ఇంత‌కుముందు మమిత సినిమాకు, సినిమాకు బాగా గ్యాప్ ఉండేది. కానీ ఇప్పుడు కేవ‌లం నెల‌వ వ్య‌వ‌ధిలో ఆమె సినిమాలు మూడు రిలీజ్ కాబోతున్నాయి. అవి మూడూ మంచి క్రేజ్ ఉన్న‌వే. ముందుగా ఈ గురువారం త‌మిళ‌నాడు సీఎం చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ కాబోతోంది. ఇందులో హీరోయిన్ పూజా హెగ్డేను మించి ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసింది మమిత. దీని ఒరిజిన‌ల్లో శ్రీలీల చేసిన పాత్ర ఇది. పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర కావ‌డంతో మమితకు మంచి పేరే వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.

ఇక వ‌చ్చే నెల 14న సూర్య సినిమా విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్‌తో ప‌ల‌క‌రించ‌బోతోంది మమిత. ఇందులో ఆమె సూర్య‌కు జోడీగా న‌టించడం విశేషం. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం స్యూర్ షాట్ హిట్ అనే అంచ‌నాలున్నాయి. ఇంకో వారానికి తన మాతృ భాష‌లో మమిత న‌టించిన బెత్లెహామ్ కుడుంబ యూనిట్ సినిమా రిలీజ్ కానుంది. అందులో స్టార్ హీరో నివిన్ పౌలీ హీరో. ఇలా కేవ‌లం నెల వ్య‌వ‌ధిలో మూడు క్రేజీ సినిమాల‌తో ప‌ల‌క‌రించ‌నున్న‌ మమిత. వీటితో హిట్లు కొడితే వేరే రేంజికి వెళ్లిపోవ‌డం ఖాయం.

This post was last modified on July 21, 2026 8:23 am

Share

Recent Posts

ఈ దెబ్బతో గొడ్డలి పార్టీ మూతపడాలి

స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీ క్లిన్ స్వీప్ చేయాలి. ఆ దెబ్బతో గొడ్డలి పార్టీ మూత పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు…

9 minutes ago

ఎక్కాల్సిన రైలు బాగా లేటయ్యింది

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలని పెద్దలు అంటారు. పెళ్లి, పిల్లలు ఏదైనా సరే ఏజ్ బార్…

25 minutes ago

నాన్న, అమ్మ, కొడుకు.. ఇప్పుడు కూతురు కూడా

సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…

2 hours ago

స్థానిక ఎన్నికలు మీ భవిష్యత్తు

గత ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను పనిచేశాను. స్థానిక ఎన్నికలు మీ భవిష్యత్తు. మీ అవసరాల కోసం. అందుకే…

6 hours ago

మోడీ ప‌ర్య‌ట‌న‌… బ్లాక్ డ్రెస్‌లో సీఎం విజ‌య్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆదివారం త‌మిళ‌నాడులో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప్రారంభించారు. అయితే..…

11 hours ago

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

11 hours ago