Political News

వాసిరెడ్డికి లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టేనా?

వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌హిళా నాయ‌కురాలు.. వాసిరెడ్డి ప‌ద్మకు పొలిటిక‌ల్‌గా లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా మంత్రి నారా లోకేష్‌తో ఆమె భేటీ అయ్యారు. దీంతో త్వ‌ర‌లోనే ఆమె టీడీపీ కండువా క‌ప్పుకొనే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. ప్ర‌తి విష‌యంలోనూ దూకుడుగా ఉండే వాసిరెడ్డి ప‌ద్మ దాదాపు 20 ఏళ్ల‌కుపైగానే రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నారు.

వైసీపీ అధికార ప్ర‌తినిధిగా.. ఆ పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్‌గా వ్య‌వహ‌రించారు. గ‌త ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని భావించినా.. జ‌గ‌న్ ఆమెకు అవ‌కాశం ఇవ్వ‌లేదు. దీంతో అప్ప‌టి ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నారు. ఎన్నిక‌ల అనంతరం.. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌ద్మ‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం తెలిసిందే. జ‌గ‌న్ కార‌ణంగానే అంద‌రూ ఓడిపోయార‌ని అన్నారు.

పార్టీని న‌డిపించ‌డం.. నాయ‌కుల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌డం కూడా రాద‌ని ప‌ద్మ వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలోనే వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆమె.. అప్ప‌టి నుంచి ఏ పార్టీలోనూ చేర‌కుండా మౌనంగా ఉన్నారు. సుమారు ఏడాదిన్న‌ర‌గా మౌనంగా ఉన్న ప‌ద్మ‌.. తాజాగా టీడీపీలో చేర‌నున్న‌ట్టు తెలుస్తోంది. పార్టీ జాతీయ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు నారా లోకేష్‌తో ఆమె భేటీ అయ్యారు. ఆయ‌న ప‌నితీరు, మంత్రి వ‌ర్గంలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరునుకొనియాడారు.

అయితే.. ఇప్ప‌టికిప్పుడు వాసిరెడ్డి చేరిక‌పై పార్టీలో ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ వ‌స్తుంద‌ని అంటున్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో పద్మకు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. పైగా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం పెరుగుతున్న ద‌రిమిలా వాసిరెడ్డికి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసేందుకు కూడా మంచి అవ‌కాశం చిక్కే ప‌రిస్థితి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 

This post was last modified on July 17, 2026 10:20 am

Share

Recent Posts

ఇది కియారా అద్వానీకే సాధ్యం

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…

12 minutes ago

మహా కథ మళ్ళీ కంచెర్లపాలెంకే

మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…

19 minutes ago

నష్టాలు వచ్చాయని ఒప్పుకున్న నాని

తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…

36 minutes ago

చివరి మ్యాచ్‌లోనూ అదే మెస్సీ… వారసుడికే గోల్ ఇచ్చి వెళ్లాడు!

21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…

41 minutes ago

అక్కడ కలెక్షన్ల వర్షం… ఇక్కడ వసూళ్ల నీరసం

కొన్ని సినిమాలు నేటివిటీ మీద ఆడతాయి. ఒక చోట బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన పక్కన కూడా అదే రిజల్ట్…

1 hour ago

వరప్రసాద్ స్నేహితులకు ఒకే సమస్య

మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…

2 hours ago