ప్రపంచంలోని ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే మక్కా నగరంలో తొలిసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. హౌతీ తిరుగుబాటుదారుల వరస దాడుల నేపథ్యంలో సౌదీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఉమ్రా యాత్ర కోసం ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి తరలివచ్చిన భక్తులను అలెర్ట్ చేశారు. వైమానిక దాడులకు సంబందించి హెచ్చరికలు జారీ చేశారు.
సౌదీ అరేబియాపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు వరుసగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మక్కా, జెడ్డా, తాయిఫ్ సహా పలు ప్రాంతాల్లో సౌదీ పౌర రక్షణ విభాగం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. మక్కా నగరానికి అత్యంత సమీపంలోకి వచ్చిన డ్రోన్ కూల్చివేసినట్లు సమాచారం. అందుకే హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే మక్కాలో ప్రమాదం తొలగిపోయినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో టెన్షన్ తొలిగినట్లయ్యింది.
మక్కాను లక్ష్యంగా చేసుకొని దాడులకు ప్రయత్నించినట్టు వచ్చిన వార్తలను హౌతీలు ఖండించారు. హౌతీ రాజకీయ విభాగానికి చెందిన హాజెమ్ అల్-అసద్ సౌదీ ఈ ఆరోపణలను తిరస్కరించారు. హౌతీలు అలాంటి తప్పు చేయదని స్పష్టం చేశారు. అయితే మక్కాలో హెచ్చరికలకు ఒక రోజు సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాలపై హౌతీలు బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు సౌదీ అధికారులు తెలిపారు. మక్కాకు దక్షిణంగా వచ్చిన ఓ హౌతీ డ్రోన్‌ను సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుని ధ్వంసం చేసినట్టు అనధికార వర్గాలు వెల్లడించాయి.
ముస్లింలకు అత్యంత పవిత్రమైన నగరమైన మక్కాలో వైమానిక ముప్పు హెచ్చరిక వెలువడటం ఇదే తొలిసారి. ఈ వార్త ఒక్క సౌదీ ప్రభుత్వాన్నే కాకుండా యావత్ ముస్లిం సమాజాన్ని ఆందోళనకు గురిచేసింది. ఇరాన్, అమెరికా యుద్ధం మొదలైనప్పటి నుంచి సౌదీ మీద దాడులు జరుగుతూనే వున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోనన్న అనుమానాలు ముస్లిం సమాజాన్ని వేదిస్తున్నాయి. ఇప్పుడు మక్కాలో హెచ్చరికల జారీ కొంత కలవరపాటుకు గురిచేసింది.
This post was last modified on September 16, 2026 4:03 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…