దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది అందరికీ తెలిసిన విషయమే . మా డాక్టర్ మందులే రాస్తాడో మంత్రాలే రాస్తాడో తెలియదని ఓ పల్లెటూరి ఆసామి చెప్పిన మాటలు నూటికి నూరు శాతం నిజం అనిపిస్తాయి. డాక్టర్ రాసే తికమక భాష మెడికల్ షాపు నిర్వాహకుడికి మాత్రం ఎలా తెలుస్తుందన్నది ఎంతకూ అర్ధం కాని ప్రశ్న. ఈ నేపథ్యంలో రోగులకు చికిత్స చేసే సమయంలో వైద్యులు రాసే మందుల పేర్లు స్పష్టంగా, అర్ధమయ్యే విధంగా రాయాలని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎం ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
గతంలో కూడా హెల్త్ మిషన్ ఇలాంటి ఆదేశాలు జారీ చేసి వుంది. సుప్రీం కోర్టు సైతం మందుల పేర్లు స్పష్టంగా రాయకపోతే చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది కూడా. ఇప్పుడు మళ్ళీ ఎన్ హెచ్ ఎం మార్గదర్శకాలు విడుదల చేయడమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు దీన్ని తప్పకుండా అమలు చేయాలని ఆదేశించింది. వైద్యులు రాసే మందుల చీటీల్లో తప్పులను గుర్తించి, యాంటీ బయాటిక్స్, సిరప్, ఇంజక్షన్ల వాడకాన్ని తగ్గించడమే లక్ష్యంగా మార్గదర్శకాలు రూపొదించినట్లు అధికారులు తెలిపారు.
కొత్త మార్గదర్శకాలు ఇలా వున్నాయి. ప్రెస్కిప్షన్లో కాపిటల్ లెటర్స్ లో మాత్రమే మందుల పేర్లు రాయాల్సి ఉంటుంది. రోగి పూర్తి పేరు, వయసు వివరాలు, చిరునామా ఇవ్వాలి. మందులకు సంబందించి కంపెనీ పేరు రాయడం ఇప్పుడు సహజంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఫార్ములా మాత్రమే రాయాలి. అంటే డోలో -650 అని రాయకూడదు. పారాసెటమాల్ -650 అని రాయాలి. రోజుకు ఎన్ని డోసులు వాడాలో కూడా స్పష్టంగా వివరించాలి.
రోగి రక్తపోటు, షుగర్, గుండె జబ్బుతో పాటుగా ఇతరా సమస్యలు రాయాలి. రోగికి ఏవైనా మందులు పడకపోతే ఎలర్జీ వివరాలు పేర్కొనాలి. మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రికి రిఫర్ చేస్తే అందుకు కారణాలు రాయాలి. ఏఏ రోగ నిర్దారణ పరీక్షలు సూచించారో, రోగి మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత హాస్పిటల్ కు తిరిగి రావాలో ప్రెస్కిప్షన్ మీద రాయాలి. కొత్త నిబంధనల ప్రకారం ఫార్మకాలాజిస్టులు, క్లినికల్ ఫార్మకాసలాజిస్టులు తరచుగా తనిఖీలు నిర్వహిస్తారు. పిహెచ్సీ, జిల్లా ఆసుపత్రుల్లో మూడు నెలలకోసారి తనిఖీలు నిర్వహిస్తారు.
ఇవన్నీ నిజంగా అమలవుతాయా అంటే ఏమో అనుమానమే. మన రాష్ట్రంలో మెడికల్ మాఫియా చాలా బలంగా వుంది. ప్రభుత్వాలను శాసించేస్థితికి చేరుకుంది. ఇప్పటికే ప్రభుత్వాలు, కోర్టులు ఎన్ని ఆదేశాలు ఇచ్చినా వైద్యులు అమలు చేయడం లేదు. యమభాషలో మందులు రాయడం మానడం లేదు. నాశిరకం మందుల అమ్మకాల గురించి వస్తున్న ఆరోపణలకు అంతే ఉండటం లేదు. ఇలాంటి నేపథ్యంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఏమి చేస్తుందో చూడాలి.
అంటే ఇకపై కోడి కెలికినట్టు అర్థం కాని రీతిలో మందుల పేర్లు రాస్తే కుదరదు. రోగికి, మెడికల్ షాపు నిర్వాహకుడికి సైతం స్పష్టంగా అర్థమయ్యేలా మందుల పేర్లు రాయాల్సిందే.
This post was last modified on September 16, 2026 3:53 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…