మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు ఎక్కువ కారని హైదరాబాద్ లో ఓ కుమారుడు నిరూపించాడు. ఆస్తి కోసం వృద్దులైన తలిదండ్రులను ఇంటి నుంచి గెంటేశాడు. ఇంత సిగ్గుమాలిన పనిచేసిన సదరు కుమారుడు ఏరో స్పేస్ ఇంజనీర్ కావడం గమనార్హం. కుమారుడు, కోడలి వేధింపులకు తట్టుకోలేక ఆ వృద్ధ దంపతులు న్యాయం కోసం రోడ్డెక్కారు. ఇదిప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
హైదరాబాద్ మియాపూర్ లోని ఇందిరా రెడ్డి ఆల్విన్ కాలనీలో దేవపల్లి లక్ష్మణ్, జయలక్ష్మి అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. లక్ష్మణ్ మెట్ పల్లి లోని ఖాదీ ఇండియాలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన కుమారుడు దేవపల్లి రవికుమార్ ఏరో స్పేస్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. రవికుమార్, అతడి భార్య ప్రసూన వృద్ధ దంపతులకు తెలియకుండా ఇంటిని అమ్మకానికి పెట్టారు. తలి దండ్రులను ఐదేళ్ల పాటు పోషించిన కుమారుడు రవికుమార్, కోడలు ప్రసూన ఇప్పుడు వారిని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. దాంతో ఆ వృద్ధ దంపతులు ఏమి చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించారు.
నిజానికి వృద్ధ దంపతులకు వచ్చే పెన్షన్ సొమ్ముతో ఇంటి పై అంతస్తు నిర్మించుకున్నారు. వారు అందులో నివసిస్తున్నారు. కింది పోర్షన్ అద్దెకు ఇచ్చారు. నెల నెలా వచ్చే అరకొర పెన్షన్ తో పాటు ఆ ఇంటి అద్దెతో కడుపు నింపుకుంటున్నారు. ఇప్పుడు ఇళ్లు విక్రయిస్తే తామెలా బతకాలని వృద్ధ దంపతులు ప్రశ్నిస్తున్నారు. కుమారుడు, కోడలి ఫోటోలతో ఫ్లెక్సీ వేసి ధర్నాకు దిగడంతో ఇరుగు పొరుగు అయ్యో పాపం అంటున్నారు.
న్యాయం కావాలి అని వేసిన ఫ్లెక్సీలో ప్రేమగా పెంచిన తలిదండ్రులను ఇంట్లోంచి గెంటేసిన కొడుకు రవికుమార్, కోడలు ప్రసూన అని వుంది. ఇంటి గేటుకు లీగల్ నోటీసు అంటించి వుంది. ఈ ఘటన వృద్ధుల దైన్య స్థితిని తెలియజేస్తుంది. ఉన్నత చదువులు చదువుకున్న రవికుమార్ కనీస మానవత్వం లేకుండా వృద్దులని కూడా చూడకుండా తలి దండ్రులను ఇంట్లోంచి గెంటేయడం దుర్మార్గమని స్థానికులు మండిపడుతున్నారు.
This post was last modified on September 16, 2026 9:00 pm
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…