Movie News

మూడు రిస్కులకు అల్లు అర్జున్ సిద్ధం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకులు తెలుగువాళ్లే. ఆర్య తీసిన సుకుమార్, జులాయి – సన్నాఫ్ సత్యమూర్తి – అల వైకుంఠపురములో అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్, దేశముదురు పూరి జగన్నాథ్, రేసు గుర్రం సురేందర్ రెడ్డి వీళ్లంతా స్వచ్ఛమైన టాలీవుడ్ బ్యాచ్. ఒకరకంగా చెప్పాలంటే బన్నీకి స్టార్ డం రావడంలో వీళ్ళ పాత్ర చాలా ఉంది. అయితే కొత్త సినిమాల విషయంలో బన్నీ తీసుకుంటున్న నిర్ణయాలు తన ఆలోచనా పరిధిని అంతుచిక్కనిదిగా మారుస్తున్నాయి.

ప్రస్తుతం రాకాకు కోలీవుడ్ నుంచి వచ్చిన అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కొన్ని నెలల తరబడి స్క్రిప్ట్ డిస్కషన్స్, నెరేషన్స్ చూసిన ప్యాన్ ఇండియా మూవీ. అన్నీ జాగ్రత్తగా ఓకే అనుకున్నాకే బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తర్వాత లోకేష్ కనగరాజ్ మూవీ ఉంది. కూలి ఫలితంతో సంబంధం లేకుండా అల్లు అర్జున్ కేవలం కథను, అతని దర్శకత్వ ప్రతిభను గుర్తించి అవకాశమిచ్చాడు. త్వరలోనే స్టార్ట్ కానుంది. తాజాగా మలయాళం ఫేమ్ బాసిల్ జోసెఫ్ పేరు తెరమీదకు వచ్చింది.

ఒక సూపర్ హీరో తరహాతో కథతో బాసిల్ జోసెఫ్ ఎప్పటి నుంచో బన్నీ కోసం ట్రై చేస్తున్నాడనేది నెలల తరబడి వింటున్న వార్త. సోషల్ మీడియాలో అతని పిక్స్ చూస్తుంటే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తున్నట్టే కనిపిస్తోంది,. అంటే అల్లు అర్జున్ చేతిలో ఉన్న మూడు సినిమాల్లో రెండు తమిళం, మరొకటి మలయాళ దర్శకులు తీయబోతున్నారు. ఇంత బ్యాక్ టు బ్యాక్ నాన్ టాలీవుడ్ డైరెక్టర్లతో పని చేస్తున్న టయర్ 1 స్టార్ హీరో ప్రస్తుతానికి బన్నీ ఒక్కడే.

ఇందులో చాలా రిస్కులు ఉన్నాయి. బన్నీ ఉన్నంత మాత్రాన ప్రతిదీ బ్లాక్ బస్టర్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. ఫైనల్ గా మాట్లాడాల్సింది కంటెంటే. అసలే మన హీరోలకు కోలీవుడ్ బ్యాచ్ అంతగా కలిసి రావడం లేదు. అయినా సరే అల్లు అర్జున్ ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం చూస్తే చాలా పెద్ద గ్యాంబ్లింగ్ ఆడుతున్నాడని అనుకోవాలి. పైగా అన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లను టార్గెట్ చేసుకున్న ప్యాన్ ఇండియా సినిమాలే. 2030 దాకా బన్నీ డైరీ వీటికే సరిపోయేలా ఉంది. 

This post was last modified on July 15, 2026 10:35 am

Share

Recent Posts

అది ప్యారడైజ్ కాకి కాదు

ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…

41 minutes ago

యష్ బయటికి వచ్చే టైమయ్యింది

ఎంత పెద్ద స్టార్ హీరోకైనా డిజాస్టర్లు సహజం. ఎన్టీఆర్ ఎంజిఆర్ నుంచి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ అనుభవమే.…

50 minutes ago

నేరుగా సుప్రీం వద్దకు ఎలా వస్తారు?

రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దంపతులకు…

1 hour ago

జిమ్ జిమ్ తార అంటూ మెడికోల నిరసన

ఈ సోషల్ మీడియా జమానాలో ఏ పాట ఎప్పుడు ఎక్కడ ఎలా వైరల్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. ఆ కుర్చీని…

2 hours ago

వంగా, జక్కన్న ఫెయిల్… నీల్ అయినా నిలబెడతాడా!

స్టార్ డైరెక్టర్ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. కనీసం సమర్పకుడిగా ఆయన పేరు పోస్టర్ మీద పడితే చాలు, ఆ ప్రాజెక్టుకు…

3 hours ago

నాని నిర్ణయం రిస్క్ అవుతుందా

ప్యారడైజ్ ఫలితం తర్వాత నాని కొంచెం డిఫెన్స్ లో పడిన మాట వాస్తవం. పదే పదే మాస్ ని లక్ష్యంగా…

4 hours ago