Movie News

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను నాని, శ్రీకాంత్ ఓదెల దగ్గరుండి.చూసుకుంటున్నారు. ఓవర్సీస్ కాపీలు డిస్పాచ్ చేయాలంటే ఎక్కువ టైం లేదు. అవతల అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్ మీదున్నాయి. ప్రీమియర్ల కోసం ఎన్ఆర్ఐలు చకచకా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. యుఎస్ మొదటి షో పడేలోపు కనీసం మిలియంన్నర డాలర్లు ఖాయమని డిస్ట్రిబ్యూటర్లు, ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ ముందు రోజు రాత్రి ప్రీమియర్లకు ప్లానింగ్ జరిగిపోయింది కాబట్టి దానికి అనుగుణంగా ఎలాంటి జాప్యం రాకుండా చూసుకోవాలి. ఇంటర్వ్యూల కోసం పలువురు మీడియా ప్రతినిధులు ప్రయత్నిస్తునప్పటికీ నానికి వెసులుబాటు దొరకడం లేదు. ఓదెల అసలా మూడ్ లోనే లేరట. అందుకే రాఘవ్ జుయెల్ తో చేసిన కార్ చాటింగ్ ని నిన్న విడుదల చేశారు. వాటిలో విశేషాలు వీడియో రూపంలో ఎక్స్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో తిరుగుతున్నాయి.

నాని చాలా దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఎందుకంటే ఇకపై ఏ సినిమా చేసినా ప్రతిదీ ప్యారడైజ్ అంత హైప్ తేవచ్చు తేకపోవచ్చు. కానీ ఇప్పుడీ బజ్ వాడుకుని హిట్ కొడితే మటుకు ఆ కిక్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోతుంది. పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఎలా అయితే ఒక ప్రణాళిక ప్రకారం ప్యాన్ ఇండియా అడుగులు వేస్తున్నాడో నానికి కూడా ఆ ఛాన్స్ దొరుకుతుంది. ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ టైంలోనే బిజినెస్, ఆఫర్లు, ఓటిటి డీల్స్ లాంటివి హాట్ కేక్స్ లా మారిపోతాయి.

ఇవాళ్టిని మినహాయిస్తే ప్రీమియర్ షోలకు ఇంకో ఆరు రోజులు మాత్రమే టైం ఉంది. నాని, శ్రీకాంత్ ఓదెల ఇద్దరూ సారధి స్టూడియోస్ లోనే మకాం వేసి అన్ని పనులను దగ్గరుండి చూసుకుంటున్నారని సమాచారం. రెండు క్యారవాన్లు అక్కడే అందుబాటులో ఉంచారట. కయదు లోహర్ హీరోయిన్ గా నటించిన ప్యారడైజ్ లో మోహన్ బాబు, రాఘవ్ జుయెల్ విలన్లుగా నటించగా సంపూర్ణేష్ బాబు మొదటిసారి చాలా సీరియస్ క్యారెక్టర్ చేశాడు. యాక్షనే కాదు ఎమోషన్స్ కూడా బలంగా ఉంటాయట.

This post was last modified on September 17, 2026 10:56 am

Share

Recent Posts

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

31 minutes ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

3 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

3 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

4 hours ago

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

5 hours ago

ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…

5 hours ago