ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వరకు ఇదే కల్చర్ కొనసాగుతుంది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున మేనకోడలు, సినీ నిర్మాత సుప్రియ యార్లగడ్డకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సెంటర్లో సభ్యురాలిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రియ యార్లగడ్డ 1996లో పవన్ కళ్యాణ్ తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా పెద్దగా ఆడక పోవడంతో తగిన గుర్తింపు రాలేదు. కొన్నేళ్లు నటనకు దూరంగా వున్నారు. తిరిగి 2018లో అడవి శేష్ నటించిన గూఢచారిలో నటించారు. ఇప్పుడు దాని సీక్వెల్ జీ 2లో నటిస్తున్నారు. నటిగా కొనసాగుతూనే ఆమె నిర్మాతగా మారారు. అన్నపూర్ణ స్టూడియోస్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా క్షణం తీరిక లేకుండా బిజీగా వున్నారు. తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సెంటర్లో సభ్యురాలిగా నియమించబడ్డారు.
2017లో 12 మంది సభ్యులతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డును కేంద్ర ప్రభుత్వం నియమించింది. అప్పటి సభ్యుల పదవీకాలం ముగిసినప్పటికీ తిరిగి వెంటనే భర్తీ చేయలేదు. ఇప్పుడు బోర్డు సభ్యుల సంఖ్యను 18 కి పెంచింది. కొత్త బోర్డులో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, గ్రామీ అవార్డు విజేత రికీ కేజ్, నటుడు మనోజ్ జోషి, బెంగాలీ యాక్టర్ ప్రసేన్‌జిత్ ఛటర్జీ, నటి పల్లవి జోషి, టెలివిజన్ నటి రూపాలీ గంగూలీలకు చోటు కల్పించారు. వీరితో పాటు వినోద్ అనుపమ్, అభిషేక్ జైన్, హన్స్‌రాజ్ హన్స్, యతీంద్ర మిశ్రా, నీలా మాధబ్ పాండా, నిషిగంధ వాడ్, వామన్ కేంద్రే, రమేష్ పతంగే వంటి వివిధ రంగాలకు చెందినవారికి బోర్డులో స్థానం కల్పించడం విశేషం.
వీరితో పాటుగా ప్రీతి జింటా, సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి.. ఇందులో ఉన్నారు. ఈ నూతన బోర్డు మూడేళ్ల పాటు కొనసాగుతుంది. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇది వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా మొత్తం సిల్వర్ స్క్రీన్ లో పండుగ వాతావరణం కనిపిస్తుంది.
This post was last modified on September 16, 2026 9:47 pm
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…
అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జైలర్-2’ సినిమా. 2023లో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన…
రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు చాలామంది చేస్తుంటారు. కానీ ఆ గుంతను బాగు…
ఫౌజీ వాయిదా పడింది. సంతోషం. ఇలాంటి పోస్టుపోన్లు చూడటం కొత్తేమి కాదు కాబట్టి అందులో ఫీలవ్వడానికి ఏం లేదు. మరి…
ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో వివాదాల నేపథ్యంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్…