Political News

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య తలెత్తకుండా పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోస్తూ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం సమర్థంగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి, ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి నీటి ప్రవాహం క్షీణించడంతో కృష్ణా డెల్టా సాగుపై అనిశ్చితి నెలకొంది. పులిచింతల జలాశయంలో ఉన్న 32 టీఎంసీల నీరు మాత్రమే లక్షల ఎకరాల ఆయకట్టుకు సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా 2015లో ప్రారంభించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం రైతులకు ఆధారంగా మారింది. 

ఇదే విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటిపారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తోందని, సముద్రంలోకి వృథాగా వెళ్లే నీటిని సద్వినియోగం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోందని కేటీఆర్ కితాబిచ్చారు..అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు.

నీటిపారుదల రంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

This post was last modified on July 15, 2026 10:22 pm

Share

Recent Posts

మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే…

2 hours ago

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

3 hours ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

4 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

6 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

8 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

8 hours ago