Political News

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే ఉత్త‌రం మూల‌న ఈ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వైసీపీ అదినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్.. అంతిమ యాత్ర‌లో పాల్గొన్నారు. తొలుత నివాళుల‌ర్పించిన ఆయ‌న‌.. ముద్ర‌గ‌డ కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. వారికి అండ‌గా ఉంటాన‌ని భ‌రోసా ఇచ్చారు. ముద్ర‌గ‌డ ఆశ‌యాల‌ను నెరవేర్చేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నం కూడా చేస్తామ‌న్నారు.

అనంత‌రం చేప‌ట్టిన అంతిమ యాత్ర‌లో(కొద్ది దూరం) ముద్ర‌గ‌డ పాడెను మోసిన జ‌గ‌న్‌.. ఆయ‌న అంతిమ సంస్కారాన్ని ద‌గ్గ‌ర ఉండి నిర్వ‌హించారు. అనంత‌రం పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి.. వెళ్లిపోయారు. కుమారుడు గిరి తండ్రి పార్థివ దేహానికి నివాళుల‌ర్పించి.. అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. తుది కార్య‌క్ర‌మాల్లో ప‌లు జిల్లాల నుంచి కాపు నాయ‌కులు, అభిమానులు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు. అయితే.. ఇంటి ఆవ‌ర‌ణ‌లో వారంతా అడుగు పెడితే.. తొక్కిస‌లాట జ‌రుగుతుంద‌న్న ఉద్దేశంతో పోలీసులు వారిని నిలువ‌రించారు.

ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌పై ..

ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు అధికారిక లాంఛ‌నాల ప్ర‌కారం అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి జిల్లా క‌లెక్ట‌ర్ కూడా ఉత్త‌ర్వులు జారీ చేశారు. అయితే.. ఈ లాంఛ‌నాల‌ను వ‌ద్ద‌ని ముద్ర‌గ‌డ కుటుంబం స్ప‌ష్టం చేసింది. దీనిపై రెండు ర‌కాల వాద‌న‌లు వినిపిస్తున్నాయి. కొంద‌రు ముద్ర‌గ‌డ కుటుంబం నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించ‌గా.. మ‌రికొంద రు మాత్రం.. అంతిమ సంస్కారాల విష‌యంలో రాజ‌కీయాలు ఎందుకు..? అనే మాట అన్నారు. ముఖ్యంగా వైసీపీ నాయ‌కులు చాలా మంది స‌ర్కారు లాంఛ‌నాల‌పై వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేశారు. చివ‌ర‌కు వ్య‌క్తిగ‌త లాంఛ‌నాల‌తోనే కుటుంబం అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించింది.

This post was last modified on July 15, 2026 7:48 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

5 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

5 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

6 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

6 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

7 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

7 hours ago