ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి.. బుధవారం మధ్యాహ్నం.. హైదరాబాద్‌లోని నివాసానికి చేరుకున్నారు. గత నాలుగు రోజుల కిందట ఆయన కుడి భుజానికి ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. కొద్ది రోజులు ఆసుపత్రిలోనే ఉండి వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడిన ఆయన.. కొద్దిగా కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
అభిమానుల కోలాహలం..
పవన్ కల్యాణ్ డిశ్చార్జ్ అవుతున్నారన్నవార్త బయటకు రాగానే.. అభిమానులు పెద్ద సంఖ్యలో కోకిలా బెన్ ఆసుపత్రిని చుట్టుముట్టారు. పవన్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ.. స్థానిక బడా గణేష్ ఆలయంలో పూజలు చేయించారు. అనంతరం.. పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కు.. విమానాశ్రయం వరకు వీడ్కోలు పలికారు. తమ అభిమాన నాయకుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు. జై పవన్ నినాదాలతో కోకిలా బెన్ ఆసుపత్రి ప్రాంగణం దద్దరిల్లింది.
ఆసుపత్రి వైద్యులకు..
తనను కంటికి రెప్పలా చూసుకున్న ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి పవన్ కల్యాణ్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఆపరేషన్ వైద్య బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్‌కు చేతులు జోడించి నమస్కరించి.. జ్ఞాపికను అందించారు. గత నాలుగు రోజులుగా తనకు ఆసుపత్రిలో సేవలు చేసిన సిబ్బందికి ప్రత్యేకంగా కానుకలు ఇచ్చారు. ప్రతి ఒక్కరికీ ముంబాయి మిఠాయి ప్యాకెట్లను పంపిణీ చేశారు. నగదు కూడా అందించారు.
చంద్రబాబు ఫోన్!
ముంబై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న కొద్ది సేపటికి ముందు సీఎం చంద్రబాబు పవన్‌కు ఫోన్ చేశా రు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అంతా బాగుంటేనే డిశ్చార్జ్ కావాలని లేకపోతే.. ఆసుపత్రి లోనే రెస్ట్ తీసుకోవాలని ఆయనకు సూచించారు. ఈ సమయంలో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియ లు.. ప్రభుత్వం తరఫున వ్యవహరించాల్సిన తీరుపై కూడా ఇరువురు చర్చించారు.
This post was last modified on July 15, 2026 6:51 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…