Political News

‘భద్రాచలం రాముడి మీద ఆనా… ఈసారి కాంగ్రెస్ పార్టీకి 117!’

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చి తీరుతుంద‌న్నారు. అంతేకాదు, 117 సీట్ల‌లో గెలిచి తీరుతామ‌ని ఆయ‌న చెప్పారు. భ‌ద్రాద్రి రామ‌య్య‌పై ఆన‌.. వ‌చ్చే ఎన్నికల్లో మేం 117 స్థానాల్లో గెలిచి తీరుతాం. అని వ్యాఖ్యానించారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని జ‌గ‌న్నాథ‌పురంలో నిర్వ‌హించిన కార్య‌క్రమంలో రైతు భ‌రోసా చివ‌రి విడ‌త నిధుల‌ను ఆయ‌న పంపిణీ చేశారు. అనంత‌రం సీఎం మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ యం త‌మ‌దేన‌ని చెప్పారు.

రాష్ట్రంలో ప్ర‌స్తుతం 119 శాస‌న స‌భ స్థానాలు ఉన్నాయి. వ‌చ్చే పార్ల‌మెంటు స‌మావేశాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు బిల్లు ఆమోదం పొందితే.. 50 శాతం మేర‌కు సీట్లు పెర‌గ‌నున్నాయి. దీంతో ప్ర‌స్తుతం ఉన్న 119 సీట్లు 182కి చేర‌నున్నాయి. ఈ లెక్క‌న తాము 117 స్థానాల్లో ఖ‌చ్చితంగా విజ‌యం ద‌క్కించుకుంటామ‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల‌కు మేలు చేస్తున్నామ‌ని .. గ‌త పాల‌కులు విస్మ‌రించిన వ‌ర్గాల‌ను కూడా తాము అక్కున చేర్చుకుంటున్నామ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 80 వేల‌కుపైగా ఉద్యోగాలు ఇచ్చామ‌ని, మ‌రిన్ని ఉద్యోగాలు క‌ల్పించేందుకు రెడీగా ఉన్నామ‌ని చెప్పారు.

ఎన్నిక‌లు 2029లోనే..

వ‌చ్చే ఎన్నిక‌లు 2029లోనే జ‌రుగుతాయ‌ని సీఎం చెప్పారు. 2028లో జ‌ర‌గ‌బోవ‌ని వెల్ల‌డించారు. ఎవ‌రో ఏదో ముందస్తుగా ఎన్నిక‌లకు వెళ్లార‌ని తాము అలా వెళ్లేది లేద‌ని చెప్పారు. షెడ్యూల్ ప్ర‌కార‌మే రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని వివ‌రించారు. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకుంటుంద‌న్నారు. లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కి పెరుగుతాయని తెలిపారు. వాటిలోనూ ర‌మార‌మి 20 స్థానాల్లో విజ‌యం సాధిస్తామ‌న్నారు. ఏ పార్టీతోనూ త‌మ‌కు పంచాయ‌తీ లేద‌ని.. ప్ర‌జ‌ల‌తోనే క‌లిసి ఉంటామ‌ని, ప్ర‌జ‌ల‌తోనే విజ‌యం ద‌క్కించుకుంటామ‌ని తేల్చి చెప్పారు.. గ‌త పాల‌కులు రాష్ట్రాన్ని అప్పుల మ‌యం చేశార‌ని.. అందుకే ఖ‌జానా ఇబ్బంది ప‌డుతోంద‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on July 10, 2026 10:49 pm

Share

Recent Posts

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

26 minutes ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

51 minutes ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

1 hour ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

1 hour ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

2 hours ago

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

3 hours ago