Movie News

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం మాములు విషయం కాదు. సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న అజయ్ దేవగన్ కు ఊహించిన దాని కన్నా గొప్ప ఫలితం దక్కేలా ఉంది. అయితే ఇదే జోరు ఇక మీదట ఏ మేరకు కొనసాగిస్తారనే దాన్ని బట్టి అయిదు వందల మార్కు దాటుతుందా లేదానేది ఆధారపడి ఉంటుంది. చూస్తుంటే అదేం పెద్ద విషయంలా కనిపించడం లేదు. అన్నంత పని చేసేలానే ఉంది.

కలెక్షన్ల సంగతి కాసేపు పక్కనపెడితే దృశ్యం ఫ్రాంచైజ్ కున్న ప్రధాన బలం సినిమాలో వచ్చిన షాకింగ్ ట్విస్టులు. మొదటి భాగం చూసినప్పుడు ఆడియన్స్ స్పెల్ బౌండ్ అయ్యింది వీటి వల్లే. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో శవాన్ని తవ్వుతుంటే జంతువు కళేబరం రావడం వన్ అఫ్ ది బెస్ట్ ట్విస్ట్ ఇన్ సినిమా హిస్టరీగా విశ్లేషకులు చెబుతుంటారు. దృశ్యం 2లో రచయిత, పుస్తకం, కోర్ట్ ఎపిసోడ్ బాగా పేలడం వల్ల క్లిక్ అయ్యింది. కానీ దృశ్యం 3లో అలాంటి మేజిక్ మిస్ అయిన మాట వాస్తవం.

హీరో రెండు చోట్ల ఉన్నాడని ఋజువు చేసేందుకు పెట్టిన టేప్ రికార్డర్ ట్విస్టు మరీ పేలవంగా ఉంది. అంతే కాదు చర్చి దగ్గర అస్థిపంజరం వెలికితీసే ఎపిసోడ్ లో కూడా చాలా లాజిక్స్ మిస్ అయ్యారు. ఫ్లోలో ఏదో అలా వెళ్లిపోయాయి కానీ దర్శకుడు జీతూ జోసెఫ్ అంత లోతైన థింకింగ్ బాలీవుడ్ దృశ్యం 3 మేకర్స్ ఫాలో కాలేకపోయారు. అయినా మలయాళం దృశ్యం 3నే సరిగా హ్యాండిల్ చేయలేక చేతులు ఎత్తేసిన తర్వాత జీతూ జోసెఫ్ నుంచి కూడా ఆశించడానికి ఏం లేదు.

ఆడియన్స్ బాగా తెలివి మీరిపోయిన ఇలాంటి ట్రెండ్ లో దర్శకులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇంటెలిజెంట్ ఫిలిం మేకింగ్ చాలా అవసరం. ఇప్పుడంటే వసూళ్లు వస్తున్నాయి కానీ రేపు ఇంకో ఇలాంటి సినిమా ఇంతే రెస్పాన్స్ తెచ్చుకుంటుందనే గ్యారెంటీ లేదు. అందుకే వెంకటేష్ దృశ్యం 3కి దూరంగా ఉండటం ప్లస్ అయ్యింది. అయినా ఎంతసేపు ఆ పోలీస్ ఆఫీసర్ కొడుకు శవం చుట్టూ కాకుండా ఏదైనా కొత్త కేసుతో దృశ్యం సిరీస్ కొనసాగించే ఆలోచన చేస్తే బెటరేమో.

This post was last modified on October 5, 2026 11:18 am

Share

Recent Posts

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

2 minutes ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

34 minutes ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

56 minutes ago

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

3 hours ago

కుటుంబం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి

నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…

3 hours ago

రాజమౌళి రాబోయే ‘ట్రబుల్’ని గుర్తించలేదా

స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…

4 hours ago