షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో బిజీ కాబోతున్నారు. ఆగిపోయిన దాదాని రీ స్టార్ట్ చేయించారు. ఫ్రెష్ గా మైసూర్ షెడ్యూల్ కోసం పదిహేను రోజులు డేట్లు ఇచ్చారు. ప్రస్తుతం అక్కడికి చేరుకోబోతున్నారు. ఇది నిర్విరామంగా జరిగితే ఆ తర్వాత ఇంకో ఇరవై రోజుల షూట్ పెండింగ్ ఉంటుందట. ఇందులోనే బాలయ్య మీద తమన్ కంపోజ్ చేసిన సాంగ్ పిక్చరైజేషన్ ఉంటుంది
అంటే మొత్తం ఒక ముప్పై అయిదు రోజులు బాలయ్య సహకారం దక్కితే డిసెంబర్ 24 విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదు. దానికి అనుగుణంగానే దర్శకుడు గోపీచంద్ మలినేని పక్కా ప్లానింగ్ తో ఉన్నారని సమాచారం. ఇప్పటికే బాలయ్య లేని సీన్లు ఎపిసోడ్లు అన్నీ పూర్తి చేసి వాటికి పోస్ట్ ప్రొడక్షన్ చేయిస్తున్నారు. కాకినాడ పోర్ట్ లో కొంత భాగం ఉంటుందని టాక్. గ్యాంగ్ స్టార్ గా బాలయ్య నటిస్తున్న ఈ మాఫియా డ్రామాలో గతంలో చూడని షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయట.
ఇంత రిస్క్ చేసి బాలయ్య దాదా కోసం రావడానికి కారణం లేకపోలేదు. ఇప్పటికే ఆలస్యమయింది. సంక్రాంతికి రావడం కన్నా క్రిస్మస్ కు వస్తే లాభాలు ఎక్కువ ఉంటాయని భావించడంతో పాటు ఓటిటి క్యాలెండర్ ప్రకారం వాయిదా వేసుకునే ఛాన్స్ లేదని వినికిడి. అందుకే ఆఘమేఘాల మీద పరుగులు పెడుతున్నట్టు తెలిసింది. ఒకవేళ అనుకోని అవాంతరాలు బ్రేకులు ఏమైనా పడితే అప్పుడు 2027 సంక్రాంతికి చిరంజీవి, వెంకటేష్ తో బాలయ్య తలపడాల్సి ఉంటుంది.
ఇప్పటికే టీజర్ కు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ వదలబోయే ట్రైలర్ తో అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోతాయని టీమ్ అంటోంది. గత ఏడాది అఖండ 2 తాండవం తర్వాత బాలయ్యకు సంవత్సరం గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడది తీర్చే అవకాశం దక్కింది. వీరసింహరెడ్డి కాంబినేషన్ కావడంతో అభిమానుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మంచు మనోజ్ విలన్ గా నటించడం మరో ఆకర్షణ కానుంది. బాలయ్య కాంబోలో మనోజ్ గతంలో ఊకొడతారా ఉలిక్కిపడతారాలో నటించిన సంగతి తెలిసిందే.
This post was last modified on October 5, 2026 1:43 pm
హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…
దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…