Movie News

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్ ఈ వారంలోనే వచ్చేస్తుంది కాబట్టి హైప్ ఎంత మోతాదులో పెరుగుతుందనేది దాంట్లో ఉన్న కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇందులో జంటగా నటించిన రియల్ లైఫ్ భార్య భర్తలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇచ్చిన ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు తెచ్చుకుంటున్నాయి. ట్రోలింగ్ కూడా అవుతున్నాయి.

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కపుల్ గా వీళిద్దరి మీద ప్రేక్షకుల్లో స్పెషల్ ఇంటరెస్ట్ ఉంది నిజమే. అయితే పెళ్లయ్యే ముందు వరకు దక్కినంత ప్రచారం, ఆసక్తి తర్వాత ఉండదు. ఇది ఎవరికైనా సహజమే. అయితే రణబాలి ప్రమోషన్లలో కేవలం విజయ్, రష్మికనే హైలైట్ అవుతూ ఇంట్లో ఎలా ఉంటారు, ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తిస్తారు, ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి ఇంటికి వచ్చేదాకా దినచర్య ఎలా ఉంటుందనే లోతైన డీటెయిల్స్ కామన్ ఆడియన్స్ కి అవసరం లేదు.

స్టార్ల సినిమాల మీద ఉన్నంత శ్రద్ధ వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద అభిమానులకు ఉండదనేది వాస్తవం. ముందు రణబాలిలో ఏమేం చూపిస్తారో, ఎలాంటి గొప్ప విషయాలు ఉన్నాయో వాటిని వివరించే ప్రయత్నం చేయాలి. చాప్టర్స్ పేరుతో కొన్ని మేకింగ్ వీడియోలు వదిలారు కానీ వాటి ఇంపాక్ట్ తక్కువగా ఉంది. ఇంకేదో చేయాలి. సౌండ్ పెరగాలంటే రణబాలిలో యునానిమస్ గా ఏదో ఉందనే విషయం ప్రపంచానికి మరింత లోతుగా తెలియాలి. కానీ ఈ స్ట్రాటజీ సరిపోదు.

ఎలాగూ ఆదర్శ కుటుంబం వాయిదా పడింది కనక రణబాలికి ఒక మేజర్ కాంపిటీషన్ తప్పింది. జైలర్ 2ని ధీటుగా ఎదుర్కొంటే చాలు. హిట్టు కొట్టొచ్చు. ఎలాగూ టికెట్ రేట్ల పెంపుకి వెళ్లడం లేదని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు కానీ దాని గురించి టెన్షన్ అక్కర్లేదు. సినిమాలో ఇంకే ఆర్టిస్టులు లేరు. హీరో హీరోయిన్ ఉంటే చాలానే రీతిలో పబ్లిసిటీ ఇంకోలా వెళ్తున్న విషయాన్నీ మేకర్స్ పసిగట్టాలి. ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీని జనంలోకి తీసుకెళ్లాలంటే కొత్త కొత్త పద్ధతులు ఆలోచించాలి.

This post was last modified on October 5, 2026 1:21 pm

Share

Recent Posts

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

2 hours ago

కుటుంబం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి

నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…

2 hours ago

రాజమౌళి రాబోయే ‘ట్రబుల్’ని గుర్తించలేదా

స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…

3 hours ago

ఎవరూ పట్టించుకోని ‘యుగంధర్’ పోరాటం

కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…

3 hours ago

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

7 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

14 hours ago