మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు. ఫ్లాప్ సినిమాల్లో నటిస్తే ఇబ్బందేం లేదు. అందరికీ వస్తుంటాయి. కానీ కాంత, ఆంధ్రకింగ్ తాలూకా లాంటివి అంతో ఇంతో డీసెంట్ టాక్ తెచ్చుకున్నా కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడం విచిత్రమే. అందం, అభినయం రెండూ ఉన్నప్పటికీ ఈ విషయంలో తనను అసంతృప్తి వెంటాడుతు వచ్చింది. అందుకే లెనిన్ ఫాన్స్ కొంత టెన్షన్ పడ్డారు.
మొదటి రోజు రెస్పాన్స్, ఓపెనింగ్స్ చూస్తుంటే భాగ్యశ్రీ బోర్సేకి గండం తప్పినట్టు ఉంది. యునానిమస్ కాదు కానీ ఉన్నంతలో థియేటర్లకు మంచి క్రౌడ్స్ రాబడుతున్నాడు లెనిన్. మెయిన్ సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. ఇంకా మొదటి రోజే కాబట్టి అప్పుడే కంక్లూజన్ కు రాలేం కానీ ఆదివారం దాకా అఖిల్ డామినేషన్ ఉండబోతోంది. సోమవారం నుంచి ఓ రెండు మూడు రోజులు ఆక్యుపెన్సీలు స్టడీగా ఉంటే హిట్టు ముద్ర పడినట్టే.
అభిమానులు దాని కోసమే ఎదురు చూస్తున్నారు. ఇక భాగ్యశ్రీ విషయానికి వస్తే భారతిగా పెర్ఫార్మన్స్ పరంగా తనకు మంచి స్కోప్ దక్కింది. ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ, ఇంటర్వెల్ ముందు బరువైన ఎమోషన్స్, సెకండాఫ్ లో అఖిల్ భార్యగా హోమ్లీ టచ్, క్లైమాక్స్ లో ఊహించని మలుపు ఇలా దర్శకుడు మురళికిషోర్ అబ్బూరు కథ చుట్టూ ఆమె చుట్టే తిప్పారు. ఆమెను ఎంచుకోవడం ద్వారా తెలివైన పని చేశారని మూవీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎలా చూసినా భాగ్యశ్రీకి ఇది మంచి బ్రేక్ ఇచ్చేలానే ఉంది. పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత మొదటి రోజు థియేటర్స్ ఫుల్స్ చేసిన సినిమా ఈ సీజన్ లో ఇదొక్కటే. గత వారం వచ్చిన రావు బహదూర్, నాగబంధం నెమ్మదించి పోవడంతో ఆడియన్స్ కి ఇదే మంచి ఛాయస్ కానుంది. రామ్ చరణ్ ముప్పై ఐదు రోజులకే సెలవు తీసుకోగా సమంత డీసెంట్ గా లాక్కొస్తోంది. వంద కోట్ల మైలురాయి ఇవాళో రేపో అందుకునేలా ఉందని ట్రేడ్ టాక్.
This post was last modified on July 10, 2026 10:07 pm
రాజమౌళితో సినిమా చేయాలని ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి పేరున్న హీరో ఆశపడుతుంటాడు అనడంలో సందేహం లేదు. ఐతే రాజమౌళి…
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఎలా ఉన్నా.. ప్రజలతో మాత్రం పార్టీలకు సాన్నిహిత్యం ఉండాలి. అది కొరవడితే.. ఎప్పటికీ చేరువ…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్…
పెద్ద బడ్జెట్ పెట్టి, చాలా కాలం కష్టపడి, ఎన్నో ఆశలతో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే తట్టుకోవడం తేలిక…
ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో అత్యంత శ్రద్ధ చూపిస్తున్న విషయం తెలిసిందే. రైతుల నుంచి భూములు సమీకరించడం(పూలింగ్)…
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…