Trends

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో ఆమె బానెట్‌ను పట్టుకుని వేలాడాల్సి వచ్చింది. అలా దాదాపు కిలోమీటర్ వరకు కారు వెళ్లింది. మీరట్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

35 ఏళ్ల సునీతకు తన భర్త మయాంక్ సింగ్ మరో మహిళతో ఉన్నాడని సమాచారం వచ్చింది. మయాంక్ ప్రాపర్టీ డీలర్‌గా పనిచేస్తున్నాడు. లోహియానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పెట్రోల్ బంక్ దగ్గర ఇద్దరూ కారులో కనిపించారు. దీంతో సునీత వారిని నిలదీసింది. కారులో ఉన్న మహిళను బయటకు లాగేందుకు ప్రయత్నించడంతో ముగ్గురి మధ్య గొడవ జరిగింది.

ఆ తర్వాత మయాంక్ అక్కడి నుంచి కారుతో వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సునీత పోలీసులకు తెలిపింది. ఆమె కారు ముందు ఉండగానే అతడు ముందుకు వెళ్లడంతో బానెట్‌ను పట్టుకుంది. అయినా కారు ఆపలేదని ఆరోపించింది. తనను కింద పడేసేందుకు రెండుసార్లు కారును డివైడర్ వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది. చివరకు స్థానికులు కారును అడ్డుకుని ఆపారు.

కారు ఆగిన తర్వాత కూడా మయాంక్ తనపై దాడి చేశాడని సునీత ఆరోపించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు హత్యాయత్నం, బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మయాంక్‌తో పాటు కారులో ఉన్న మహిళను అరెస్ట్ చేశారు. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. సునీత చేసిన ఆరోపణలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సునీత, మయాంక్‌కు 2012లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలోనూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయని పోలీసులు తెలిపారు. సునీత కుటుంబ సభ్యులు అప్పట్లో మయాంక్‌పై ఫిర్యాదు కూడా చేశారు. తర్వాత ఇరు వర్గాలు రాజీకి వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు మరో గొడవతో కేసు నమోదైంది.

This post was last modified on October 5, 2026 11:38 am

Share

Recent Posts

కుటుంబం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి

నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…

24 minutes ago

రాజమౌళి రాబోయే ‘ట్రబుల్’ని గుర్తించలేదా

స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…

1 hour ago

ఎవరూ పట్టించుకోని ‘యుగంధర్’ పోరాటం

కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…

2 hours ago

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

5 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

13 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

13 hours ago