తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. “ఇప్పటి వరకు మీరు అన్న.. అన్న అంటూ అన్నరాజ్యం చూశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. అక్కరాజ్యం ఎలా ఉంటుందో చూపిస్తా.“ అంటూ.. తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో.. ఎవరిని ఎంతగా గౌరవించాలో అంతా చేస్తామని నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతేకాదు.. తాము అధికారంలోకి వస్తే.. రాష్ట్రం స్వరూపాన్నే మార్చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వంలో గౌరవ మర్యాదలు దక్కేలా చేస్తామన్నారు.
ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్రంలో ఏమాత్రం గౌరవం లేదని కవిత ఆరోపించారు. ఇది వేళ్లూనుకుపోయిన వ్యవస్థకు తార్కాణమని పేర్కొన్నారు. దీనిని సమూలంగా మార్చేందుకు తాము ప్రయత్నిస్తామన్నారు. అక్క రాజ్యంలో ఎస్సీ, ఎస్టీలు సగౌరవంగా జీవించేందుకు వారికి ఉన్న హక్కులను పరిరక్షించేందుకు, మరిన్ని హక్కులు కల్పించేందుకు కట్టుబడి పాలిస్తామన్నారు. రైతులకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణా లేకుండా పోయిందని, కనీసం వారిని కూర్చోబెట్టి మాట్లాడే సంస్కృతి కూడా దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, తాము అధికారంలోకి వచ్చాక.. ప్రతి కార్యాలయంలో ప్రత్యేకంగా కుర్చీలను ఏర్పాటుచేసి రైతులను గౌరవిస్తామన్నారు.
మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు కవిత చెప్పారు. పాంచజన్యం పేరుతో తాము ప్రకటించిన హామీలను అమలు చేస్తామన్నారు. ఉద్యమ కారుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించనున్నట్టు తెలిపారు. `బాయిబాట` కార్యక్రమంలో భాగంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఆదివాసి గ్రామాల్లో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక గిరిజనులతో మమేకమయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. కనీసం గిరిజనులకు ఒక చిన్న మోటరు సైకిలు కూడా లేదని.. ఏ బ్యాంకూ వారికి రుణాలు ఇవ్వడం లేదని తెలిపారు. కార్పొరేట్ సంస్థలకు కేంద్రం హామీ ఉండి మరీ అప్పులు ఇస్తోందని విమర్శించారు.
గిరిజనుల హక్కుల సాధన కోసమే టీఆర్ఎస్ పార్టీని స్థాపించినట్టు కవిత చెప్పారు. సమస్యలు వినడమే కాదని.. పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. గిరిజన హక్కుల సాధన కోసం అవసరమైతే ఢిల్లీలో కూడా కొట్లాడుతానని ఆమె హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. వీటిని సక్రమంగా ఖర్చుచేస్తే.. ఎస్సీ, ఎస్టీలకు మేలు జరుగుతుందన్నారు. తాను అందరికోసమే రాజకీయాలు చేస్తున్నానని.. అందరూ తనకుఅండగా ఉండాలని అక్క రాజ్యంకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కవిత పిలుపునిచ్చారు.
This post was last modified on July 10, 2026 10:28 pm
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…