Political News

ఇరాన్‌ను బుగ్గి చేస్తానంటున్న ట్రంప్

“ఇరాన్‌ను మ‌సి చేస్తాం.. బుగ్గి చేస్తాం“ అంటూ అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఇరాన్ అస్తిత్వం ఇక‌, చ‌రిత్ర‌లో చ‌దువుకోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. ఇక‌, ఆ దేశంతో చ‌ర్చ‌లు అనే మాట కూడా ఎత్తేది లేద‌న్నారు. ఇరాన్ పాల‌కుల‌ను ఈ సంద‌ర్భంగా ఆయ‌న క్రూరులుగా అభివ‌ర్ణించారు. వారు.. ఈ ప్ర‌పంచంలో జీవించేందుకు అర్హులు కాద‌ని వ్యాఖ్యానించారు. ఇక‌పై ఎలాంటి హెచ్చ‌రిక లు లేకుండానే ఇరాన్‌పై దాడి చేయ‌నున్న‌ట్టు చెప్పారు.

ఏం జ‌రిగింది?

శాంతి ఒప్పందం నేప‌థ్యంలో ప‌శ్చిమాసియాలోని హోర్ముజ్ జ‌ల‌సంధిగుండా అమెరికా నౌక‌లు ప్ర‌యాణిస్తున్నాయి. అయితే.. ఒప్పందం అడ్డు పెట్టుకుని త‌మ జ‌లాల్లో నిఘా ఏర్పాటు చేస్తున్నార‌ని ఆరోపిస్తూ.. ఇరాన్ సైన్యం అమెరికాకు చెందిన మూడు వాణిజ్య నౌక‌ల‌పై దాడి చేసి.. వాటిని నీట‌మునిగేలా చేసింది. ఈ ప‌రిణామాల‌తో ఉలిక్కిప‌డిన ట్రంప్‌.. ఆగ్ర‌హోద‌గ్రుల‌య్యారు. ఇరాన్‌ను క్ష‌మించేది లేద‌ని పేర్కొన్నా రు. శాంతి ఒప్పందం కూడా ముగిసింద‌ని, ఇక‌, చ‌ర్చ‌లు అనే ప్ర‌స‌క్తేలేద‌ని స్ప‌ష్టం చేశారు.

“ఇరాన్ క్షమించరాని తప్పులు చేస్తోంది. చర్చల పేరుతో టైమ్ వృథా చేస్తోంది. ఇక‌పై ఎలాంటి చ‌ర్య‌లు ఉండ‌వు. ఆదేశాన్ని నాశ‌నంచేస్తాం. బుగ్గి చేస్తాం. ఏరుకునేందుకు ఎముక‌లు కూడా లేకుండా చేస్తాం.“ అని హెచ్చ‌రించారు. ఆయ‌న హెచ్చ‌రించే స‌రికే.. అమెరికా సైనికులు ఇరాన్‌లోని ప‌లు ప్రాంతాల‌పై దాడు లు చేశారు. మ‌రోవైపు ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ సైతం ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చ‌రించారు. హోర్ముజ్ జ‌లసంధిలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఉపేక్షించేది లేద‌న్నారు.

ప్ర‌పంచం గ‌గ్గోలు!

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న తాజా ప‌రిణామాల‌పై ప్ర‌పంచ దేశాలు మ‌రోసారి గ‌గ్గోలు పెట్టాయి. ఇప్పుడి ప్పుడే ప‌రిస్థితి దారిలోకి వ‌స్తోంద‌ని భావిస్తున్న స‌మ‌యంలో అనూహ్యంగా ఇరాన్‌పై అమెరికా విరుచుకుప డ‌డం.. ప్ర‌తిగా ఇరాన్ కూడా దాడులు ముమ్మ‌రం చేయ‌డంతో హోర్ముజ్‌పై ఈ ప్ర‌భావం ఎక్కువ‌గా ప‌డు తోంది. ఫ‌లితంగా మ‌రోసారి చ‌మురు ధ‌ర‌లు పెరిగే  అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ ప‌రిణామాల‌పై ఆందోళ‌న వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on July 9, 2026 3:09 pm

Share

Recent Posts

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

26 seconds ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

5 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

58 minutes ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

6 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

8 hours ago