Movie News

‘వృషకర్మ’ నుంచి ఏ కబురు లేదేంటి

నాగ చైతన్య గత సినిమా తండేల్ వచ్చి పదిహేడు నెలలు గడిచిపోయాయి. మళ్ళీ తనను తెరమీద చూసే ఛాన్స్ అభిమానులకు కలగలేదు. కారణం వృషకర్మలో జరుగుతున్న ఆలస్యం, విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్ షూటింగ్ ఒక కొలిక్కి వస్తున్న టైంలో ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించకపోవటం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీజర్ వచ్చి నెలలు దాటేసినా అప్డేట్స్ పూర్తిగా ఆపేయడం వాళ్ళను నిరాశపరుస్తోంది.

సమస్య కేవలం వృషకర్మదే కాదు.. సంబరాల ఏటిగట్టు, విశ్వంభర, స్వయంభు మొదలైనవి ఏదో ఒక కారణంతో అఫీషియల్ గా డేట్లు వేసుకోలేకపోతున్న సంగతి తెలిసిందే. అయితే చైతు విపరీతంగా కష్టపడిన ఈ ఫాంటసీ మూవీకి సోలో రిలీజ్ దక్కడం చాలా అవసరం. కానీ స్లాట్లు ఒక్కొక్కటిగా అయిపోతున్నా కూడా నిర్మాణ సంస్థ మౌనంగా ఉండటం చూస్తుంటే ఇంకా పని పెండింగ్ లో ఉన్నట్టు అర్థమవుతోంది. పైగా ఓటిటి డీల్ కూడా ఫైనల్ కావాలట.

ఇక ఆప్షన్ల విషయానికి వస్తే ఆగస్ట్ లో ఛాన్స్ లేదు. ఒకవేళ ఆ ఆలోచన ఉంటే ఈ పాటికి ప్రమోషన్లు మొదలైపోయేవి. సెప్టెంబర్ లో ఆల్రెడీ రష్ కనిపిస్తోంది. మీడియం ప్లస్ చిన్న బడ్జెట్ సినిమాలు క్యూ కడుతున్నాయి. అక్టోబర్ జైలర్ 2, ఆదర్శ కుటుంబంతో పాటు ఇంకో రెండు మూడు పెద్ద చిత్రాలు వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉంది. నవంబర్ డ్రైగా ఉంటుంది. డిసెంబర్ లో ఫౌజీ కనక రాకపోతే ఆ అవకాశాన్ని వృషకర్మ వాడుకోవచ్చు. కానీ అదింకా తేలలేదు.

ఇదీ మిస్ అయితే వచ్చే ఏడాది తండేల్ వచ్చిన ఫిబ్రవరికే వెళ్లాల్సి ఉంటుంది. అంటే చైతుకు రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చినట్టు అవుతుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన వృషకర్మ కోసం కోట్ల రూపాయల ఖర్చుతో భారీ సెట్లు వేశారు. ఫాంటసీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండబోతున్నాయి. బిజినెస్ పరంగా క్రేజ్ ఉంది. మరి ఇన్ని సానుకూలతలు పెట్టుకుని ఎందుకు మౌనంగా ఉన్నారనేది అంతు చిక్కని ప్రశ్న. చూడాలి ఏం చేయబోతున్నారో.

This post was last modified on July 9, 2026 3:10 pm

Share

Recent Posts

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

1 hour ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

2 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

2 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

3 hours ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

3 hours ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

4 hours ago