Political News

గంజాయి స్మగ్లర్ల కంటే మావోయిస్టులే బెటర్

తెలంగాణలో గంజాయి సాగు, రవాణా, వాడకం గతంతో పోలిస్తే చాలా పెరిగిన సంగతి తెలిసిందే. గంజాయి స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ఈగల్ టీం, పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఉపయోగం ఉండడం లేదు. ఈ క్రమంలోనే అందుకు గల కారణాలను వివరించే క్రమంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు తగ్గడం వల్లే గంజాయి సాగు పెరిగిందని ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

గతంలో గంజాయి పండించి సరఫరా చేసే ప్రాంతాలన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలని ఆనంద్ చెప్పారు. గంజాయి స్మగ్లర్లు, గంజాయి పండించే వారి పట్ల మావోయిస్టులు కఠినంగా వ్యవహరించేవారని తెలిపారు. మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గడంతో మళ్లీ గంజాయి ధందా పెరిగిందని అన్నారు.

గంజాయి పండించి, అమ్మేవారిని మావోయిస్టులు శిక్షించేవారని, అయితే, మావోయిస్టులు తగ్గిపోవడంతో గంజాయి రవాణా పెరిగిందని, ఇలా విస్తరించిందని ఆనంద్ చెప్పారు. గంజాయి స్మగ్లర్ల కంటే మావోయిస్టులే బెటర్‌ అని ఆనంద్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

గ్రేహౌండ్స్ దళాలను వేరే పనికి వాడతామని, అయినా వాళ్లొక్కరే గంజాయి సాగు, రవాణా అరికట్టలేరని చేయలేరని చెప్పారు. జిల్లా పోలీసులు, ఈగల్ టీంలు కలిసి గంజాయి సాగు, రవాణా అరికట్టాలని అన్నారు. మాదకద్రవ్యాలతో దేశానికి, రాష్ట్రానికి ముప్పు పొంచి ఉందని, వీటికి అలవాటు పడితే యువత భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. మాదకద్రవ్యాలు రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్‌ కింద కేసులు పెడతామని హెచ్చరించారు.

This post was last modified on July 9, 2026 4:01 pm

Share

Recent Posts

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

26 minutes ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

28 minutes ago

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

3 hours ago

డ్రాగన్ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి

ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…

3 hours ago

విమానంలోనే కాక్రోచ్ నాయకుడి అరెస్టు

భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న…

5 hours ago

సెటైర్లు సీరియస్‌గా తీసుకోనవసరం లేదు

నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…

6 hours ago