Political News

లోకేష్‌నే వైసీపీ టార్గెట్ చేసిందా?

ఏపీలో విపక్షం వైసీపీ ఇటీవలి కాలంలో తిరిగి యాక్టివ్ మోడ్ లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రదాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీ… చాన్నాళ్ల పాటు బయటకే రాలేని పరిస్థితి. ఆ స్థితి నుంచి ఇప్పుడిప్పుడే ఆ పార్టీ బయటకు వస్తోంది. అదే సమయంలో తన టార్గెట్ ఎవరన్న విషయాన్ని కూడా ఆ పార్టీ విస్పష్టంగానే చెప్పేస్తోంది. తమ అంతిమ టార్గెట్ టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఏపీ మంత్రి నారా లోకేశేనని కూడా ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. సీఎంగా ఉన్న టీడీపీ అదినేత నారా చంద్రబాబు నాయుడినో, లేదంటే డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్ నో ఆ పార్టీ టార్గెట్ చేస్తుందని అందరూ భావించినా అందుకు విరుద్ధంగా వారిద్దరినీ పక్కనపెట్టేసిన వైసీపీ… లోకేష్‌ ను టార్గెట్ చేస్తోంది.

వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందు టీడీపీతో జనసేన, బీజేపీల పొత్తు, విపక్షంలోని టీడీపికి నూతనోత్తేజం నింపేలా లోకేశ్ కీలక అడుగులు వేశారు. యువ గళం పేరిట లోకేశ్ చేసిన పాదయాత్ర ఏపీ రాజకీయాలను మార్చేసిందని చెప్పాలి. ఏపీలోని అన్ని జిల్లాలను టచ్ చేస్తూ సాగిన యువగళం యాత్రలో లోకేశ్ దాదాపుగా అన్ని వర్గాలకు దగ్గరయ్యారు. ఆయా వర్గాల సమస్యలను విన్నారు. వాటి పరిష్కారం దిశగా కీలక హామీలు ఇచ్చారు. జనసేన, బీజేపీలను టీడీపీకి దగ్గర చేశారు. వెరసి కూటమి ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూటమి బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టింది. ఈ లెక్కన వైసీపీ లక్ష్యం లోకేశేనన్న విశ్లేషణలు సాగాయి.

అయితే ఓటమిని జీర్ణించుకునేందుకే చాలా సమయం తీసుకున్న వైసీపి… తాజాగా బరిలోకి దిగిందనే చెప్పాలి. వైసీపీ అధినేత తన మీడియా సమావేశాల్లో, ఇతరత్రా ప్రసంగాల్లో లోకేశ్ కేంద్రంగా పెద్దగా ఆరోపణలు గుప్పించడం లేదు. ఎంతసేపూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల మీదనే ఆరోపణలు గుప్పిస్తున్న జగన్… లోకేశ్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే జిల్లా, నియోజకవర్గ స్థాయి వైసీపీ నేతలంతా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను వదిలేసి లోకేశ్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఈ తరహా ధోరణికి వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలే కారణమన్న వాదనలూ లేకపోలేదు.

వైసీపీ అదికారంలో ఉండగా… ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతల మీద వరుసగా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కుటుంబంపై కేసులు, ఆయనకు భద్రత ఉపసంహరణ తదితర నిర్ణయాలు వరుసగా జరిగిపోయాయి. వీటిపై స్పందించేందుకు మీడియా ముందుకు వచ్చిన సందర్భంగా ప్రకాశ్ రెడ్డి… లోకేశ్ ను టార్గెట్ చేసుకునే సంచలన ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా తమ టార్గెట్ నారా లోకేశేనని కూడా ఆయన పేర్కొనడం గమనార్హం. జిల్లా, నియోజవర్గ స్థాయి కూటమి నేతలను తాము పట్టించుకోమని, తాము నేరుగా లోకేశ్ నే టార్గెట్ చేసుకుని సాగుతామని ఆయన పేర్కొన్నారు.

ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటు, ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో యువతకు పద్దపీట తదితర నిర్ణయాలతో కూటమి సర్కారు లోకేశ్ కనుసన్నల్లోనే నడుస్తోందని వైసీపీలోని మెజారిటీ నేతలు భావిస్తున్న సంగతీ తెలిసిందే. కూటమి సర్కారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుక లోకేశ్ పాత్ర ఉందని కూడా వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ నేరుగా లోకేశ్ ను టార్గెట్ చేస్తే… లోకేశ్ ఎక్కడ మైలేజీ వస్తుందోనన్న భయం వైసీపీని వెంటాడుతోంది. అందుకే జగన్ ఎంతకూ లోకేశ్ ప్రస్తావనను తీసుకుని రావడం లేదు. అయితే తన పార్టీ నేతల చేత మాత్రం ఆయన లోకేశ్ ను టార్గెట్ చేయిస్తున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

This post was last modified on July 3, 2026 4:01 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

3 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

4 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

4 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

7 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

9 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

9 hours ago