Movie News

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఏంటి పరిస్థితి

టాలీవుడ్ లో జూన్ నెలలో పెద్ది, మా ఇంటి బంగారం తమ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చాయి. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే రామ్ చరణ్ అధిక శాతం ఏరియాల్లో లాభాలు ఇవ్వగా, సమంత ఏకంగా డబుల్ ప్రాఫిట్స్ తో అందరినీ ఖుషి చేసింది. గత వారం రావాల్సిన లెనిన్ వాయిదా పడటంతో ఆ స్లాట్ వృథాగా అయిపోయింది. ఈ రోజు రెండు కొత్త రిలీజులు సందడి చేశాయి. హైదరాబాద్ లో నిన్న రాత్రే ప్రీమియర్లు వేయడంతో జనాల కోలాహలం కనిపించింది.

ఇక రెస్పాన్స్ విషయానికి వస్తే నాగబంధం జానర్ అడ్వాంటేజ్ తీసుకుంది. కంటెంట్ ఎలా ఉందనేది పక్కనపెడితే ట్రైలర్ లో చూపించిన విజువల్స్, దేవుళ్ళకు సంబంధించిన రెఫరెన్సు వగైరాలు ఆడియన్స్ ని టికెట్లు బుక్ చేసుకోవడానికి టెంప్ట్ చేశాయి. మెయిన్ సెంటర్స్ లో డీసెంట్ ఆక్యుపెన్సీలు కనిపించాయి. సత్యదేవ్ రావు బహదూర్ కు మూవీ లవర్స్ మద్దతు దొరికి దర్శకుడు వెంకటేష్ మహా మీద నమ్మకంతో థియేటర్లకు జనాన్ని వచ్చేలా చేసుకుంది.

స్క్రీన్ ప్లే కొంచెం నెమ్మదిగా ఉండటంతో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకోవడంతో రావు బహదూర్ కమర్షియల్ గా ఏ స్థాయికి వెళ్తుందనేది వీకెండ్ అయ్యాక క్లారిటీ వస్తుంది. బాలీవుడ్ మూవీ అల్ఫాకి యునానిమస్ గా నెగటివ్ టాక్ రావడం అప్పుడే ప్రభావం చూపిస్తోంది. స్టార్ హీరో సినిమాలు లేకపోవడంతో థియేటర్ల దగ్గర భారీ సందడి అయితే లేదు. వారాంతంలో ఏ మేరకు పుంజుకుంటాయనే దాని మీద ఫైనల్ స్టేటస్ ఆధారపడి ఉంది.

వచ్చే వారం లెనిన్ రానున్న నేపథ్యంలో నాగబంధం, రావు బహదూర్ కు రాబోయే ఆరు రోజులు చాలా కీలకం కాబోతున్నాయి. కాకపోతే మాస్ ఎలిమెంట్స్ తక్కువగా ఉండే వీటికి ఎలాంటి మద్దతు దక్కుతుందనేది వేచి చూడాలి. వేసవి సెలవులు అయిపోయి స్కూళ్ళు కాలేజీలు తెరుచుకోవడం కొంత ఎఫెక్ట్ చూపిస్తున్న మాట వాస్తవమే. అయితే దాన్ని దాటుకుని మరీ పెద్ది, మా ఇంటి బంగారం థియేటర్స్ ని ఫుల్ చేశాయి. మరి రావు బహదూర్, నాగబంధం దాన్ని కొనసాగిస్తాయేమో వెయిట్ అండ్ సీ.

This post was last modified on July 3, 2026 9:14 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

2 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

3 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

3 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

6 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

8 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

8 hours ago