టాలెంట్ ఉండి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలంటే ఎవరో ఒకరి దగ్గర శిష్యుడిగా చేరాలి. లేదా ఎవరైనా రిఫరెన్స్ తీసుకుని ప్రముఖ దర్శకులను కలిసి ప్రసన్నం చేసుకోవాలి. ముఖ్యంగా రచయితలకు ఈ సమస్య తీవ్రంగా ఉంది. కొత్త దర్శకులు సైతం నిర్మాతలను ఒప్పించలేక, తమ కథలు నచ్చేలా చెప్పలేక పడుతున్న అగచాట్లు అన్ని ఇన్ని కావు. అయితే వినోద రంగంలో కేవలం సినిమాలే కాదు ఇప్పుడు వెబ్ కంటెంట్, వెబ్ సిరీస్, ఇండిపెండెంట్ మూవీస్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
సో కొత్త ప్రతిభ దొరికితే క్రియేటివిటీ ఉన్న కంటెంట్ సృష్టికర్తలు బయటికి వస్తారు. నెట్ ఫ్లిక్స్ అందుకే తెలివైన ఎత్తుగడ వేసింది. తమ వెబ్ సైట్ ద్వారా అప్ కమింగ్ రైటర్స్ కు ఆహ్వానం పలుకుతోంది. స్క్రీన్ రైటింగ్ లో గరిష్టంగా మూడు సంవత్సరాల దాకా అనుభవం ఉన్నా లేకపోయినా నేరుగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ప్రాధమిక వివరాలతో కూడిన ఫార్మ్ ఫిలిప్ చేశాక నెట్ ఫ్లిక్స్ ఒక సన్నివేశాన్ని ఇస్తుంది. దాన్ని ఊహించుకుని డైలాగులు, స్క్రీన్ ప్లే రాసి అప్లోడ్ చేయాలి. అది నచ్చితే పిలుపు వస్తుంది.
ఈ ఐడియా ఏదో బాగుంది కదూ. ఎంతసేపు కథల కొరత అంటూ ఈవెంట్స్ లో దర్శక నిర్మాతలు గొంతు చించుకోవడమే కానీ వాటిని వెలికి తీసే ప్రయత్నాలు చేసినవాళ్లు చాలా తక్కువ. ఎంతసేపూ తమను వ్యక్తిగతంగా కలుసుకున్న వాళ్ళను జడ్జ్ చేయడం తప్పించి కొత్తగా ఆలోచించిన దాఖలాలు పెద్దగా ఉండవు. నెట్ ఫ్లిక్స్ ఆ దిశగానే అలోచించి పరిష్కార మార్గం కనుక్కునే పనిలో పడింది. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు.
ఇది క్లిక్ అయితే మటుకు కొన్ని వేల సంఖ్యలో రచయితలు నెట్ ఫ్లిక్స్ కు దొరుకుతారు. అది కూడా కోట్లలో రెమ్యునేషన్లు ఆశించకుండా మంచి అవకాశం దొరికితే చాలని భావించే వాళ్ళు. ఇది మంచి స్ట్రాటజీ. ఊరికే తిప్పించుకోవడం కంటే ఆన్ లైన్ లో చిన్న పరీక్ష ద్వారా దర్శక రచయితల సామర్ధ్యాన్ని పరీక్షించడం ఖర్చు లేని పని. హైదరాబాద్ లో ఆఫీస్ ప్రారంభించాక నెట్ ఫ్లిక్స్ తన ఆపరేషన్స్ మొదలుపెట్టింది. ఒరిజినల్ కంటెంట్ కోసం వందల కోట్లు బడ్జెట్ సిద్ధం చేసుకుంది.
This post was last modified on July 3, 2026 5:04 pm
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, రెండు మూడు చిన్న సినిమాల అనుభవం ఉన్న హీరోను పెట్టి.. ఒక డెబ్యూ డైరెక్టర్ రూ.3-4…
అక్టోబర్ 2 నుంచి ఆదర్శ కుటుంబం ఏకె ఫార్టీ సెవెన్ తప్పుకున్నాక మళ్ళీ కొత్త డేట్ ప్రకటించలేదు. ఒకవేళ జైలర్…
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…