మావిగన్ రచ్చలో మాజీ ఎంపీ

వైసిపి చేసిన మావిగన్ ప్రతిపాదన వల్ల ప్రయోజనం ఏంటి అని మాజీ ఎంపీ, అదే పార్టీ నుంచి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు మరో మూడేళ్లు సమయం ఉందనగా ఏపీ రాజధాని అంశంపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త ప్రతిపాదనను తెరమేదికి తీసుకువచ్చారు. మావిగన్ అజెండాగా తాము వచ్చే ఎన్నికలకు వెళతామని తీర్చి చెప్పారు.

దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగడమే వైసీపీకి కావలసింది. ఇప్పుడు అదే జరుగుతోంది.. వైసీపీ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం తటస్థంగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా మావిగన్ అంశంపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఏపీ రాజధాని అమరావతి మాత్రమే అని టీడీపీ; కాదు మావిగన్‌ అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ; రెండు రాజకీయపార్టీలు చేస్తున్న భిన్న వాదనలు అర్థరహితమంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా 2014లో రాష్ట్ర విభజన జరిగింది. పన్నెండేళ్ళ తరవాత కూడా ఇంకా… రాజధాని ఎక్కడ ఉండాలన్న చర్చ నడుస్తోందంటే ఇది అందరూ సిగ్గు పడాల్సిన విషయం కాదా? అని విజయసాయి ప్రశ్నించారు. ఈ 12 ఏళ్లలో ఐదేళ్లు పరిపాలించిన వైసీపీ హయాంలో విజయసాయి ఎంపీగా ఉన్నారు. పార్టీలో కీలకమైన వ్యక్తిగా కూడా కొనసాగారు. ఆ టైంలో అమరావతిని వైయస్ జగన్ నిర్లక్ష్యం చేస్తుంటే చూస్తూ ఉండిపోయారు. రాజధాని పేరుమీద జరుగుతున్న ఈ పొలిటికల్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను ఆపేయాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీదా ఉందని ఇప్పుడు చెబుతున్న ఆయన తమ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తలేదు..?

అమరావతి పేరుతో అవినీతి జరుగుతుంది అంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలతో అవినీతిని సవాలు చేస్తూ త్వరలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను. ఇదే విజయ సాయి తన చేతికి మట్టి అంటకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారు. మొత్తం మీద మావిగన్ అంటూ జగన్ చేసిన ప్రకటనను ముందుకు తీసుకువెళ్లేందుకు, చర్చ జరిగేందుకు కొందరు నాయకులు తమ సహకారం అందిస్తున్నారని సమాచారం. జగన్ ప్రతిపాదించిన మావిగన్ అనే అంశాన్ని మాత్రమే ప్రస్తావించకుండా, అమరావతి లో అవినీతి అంటూ జగన్ మాట్లాడిన మాటలనే ఈయన కూడా వల్లే వేస్తున్నారు. ఇదే అందుకు ఉదాహరణ.