రాష్ట్రంలోని కూటమి సర్కారుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రశ్నించిన వారి గళం నొక్కుతున్నారని.. వారి రౌడీషీటర్ అనే ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. దివంగత ఎన్టీఆర్ జీవించి ఉంటే.. ఆయన కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారని, అప్పుడు ఆయనపైనా రౌడీషీటర్ అనే ముద్ర వేస్తారా? అని ప్రశ్నించారు. ఒకప్పుడు బీహార్‌ను జంగిల్ రాజ్ అనేవారని.. ఇప్పుడు ఏపీనే జంగిల్‌రాజ్‌గా మారిందని విమర్శించారు.
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్, రెడ్ బుక్ పరిపాలన జరుగుతోందని జగన్ ఆరోపించారు. గత 18 నెలలుగా వరుస అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాజధాని రైతులను పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ నాయకులు అందరూ రౌడీషీటర్లేనా? అని ప్రశ్నించారు. బుధవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాబు పరిపాలనలో బాధితులే నిందితులుగా మారుతారని వ్యాఖ్యానించారు.
రాజధాని రైతులను బాగా చూసుకుంటున్నామని చెబుతున్న చంద్రబాబు.. వారు పడుతున్న కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. బాబు పట్టించుకుని.. సమస్యలు పరిష్కరించి ఉంటే.. తన వరకు వచ్చి ఉండేవారు కాదన్నారు. రైతులు వచ్చి తనకు వారి సమస్యలుచెప్పుకొన్నారని.. ఆ తర్వాతే వైసీపీ టీం వారికి అనుకూలంగా పరామర్శించేందుకు అమరావతిలోకి వెళ్లే ప్రయత్నం చేశారని.. కానీ, వారిపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని తెలిపారు.
ఈ ఘటనలో అడ్డు తగిలి, దాడి చేసింది టీడీపీ వాళ్లు. కానీ, పోలీసులు మాత్రం మావాళ్లపై కేసులు పెట్టారు. ఇదీ.. చంద్రబాబు జంగిల్ రాజ్ పరిపాలన. అని జగన్ వ్యాఖ్యానించారు. రైతుల కోసం న్యాయ పోరాటం చేస్తామన్నారు. వారికి తమ లీగల్ టీం అన్ని విధాలా సాయం చేస్తుందని అన్నారు. వైసీపీ మాజీ మంత్రులు, నాయకులను రౌడీషీటర్లుగా ప్రొజెక్టు చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధానికి తాను వ్యతిరేకంత కాదని జగన్ చెప్పారు. అయితే.. అక్కడ జరుగుతున్న దోపిడీకే తాను వ్యతిరేకమన్నారు. అందుకే.. మావిగన్ రాజధానికే తాము కట్టుబడి ఉన్నామన్నారు.
This post was last modified on July 1, 2026 4:11 pm
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…