Political News

జగన్ వస్తేనే చంద్రబాబు స్పందిస్తున్నారా?

ఏ విష‌యంపైనైనా ముందు తాను మాట్లాడిన త‌ర్వాతే.. సీఎం చంద్ర‌బాబు స్పందిస్తున్నార‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల కృష్ణ‌లంక‌కు చెందిన సాయికృష్ణ దారుణ ఘ‌ట‌న‌కు సంబంధించి తాను వెళ్లి బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన త‌ర్వాతే.. ఈ ప్ర‌భుత్వంలో కొంచెమైనా చ‌ల‌నం క‌లిగింద‌న్నారు. అప్ప‌టి వ‌ర‌కు క‌నీసం సాయికృష్ణ త‌ల్లి ఇచ్చిన ఫిర్యాదుల‌ను కూడా డీజీపీ సైతం తీసుకోలేద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబుకు అంత ఇంట్ర‌స్ట్ ఏంట‌ని ప్ర‌శ్నించారు.

సాయికృష్ణ ఉదంతంలో సీఐని సీపీ కాపాడుతున్నార‌ని, సీపీని డీజీపీ కాపాడుతున్నార‌ని, డీజీపీని ఎవ‌రు కాపాడుతున్నారో అంద‌రికీ తెలుసున‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. సాయికృష్ణ త‌ల్లి క‌నీసం పిడికెడు బూడిద ఇమ్మ‌న్నా ఈ ప్ర‌భుత్వానికి చ‌ల‌నం లేకుండా పోయింద‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, గత ఏడాది మామిడి ధర విషయంలో నెలకొన్న సంక్షోభం విష‌యంలోనూ.. తాను స్పందిస్తే త‌ప్ప ప్ర‌భుత్వం స్పందించలేద‌న్నారు. పంట అంతా అయిపోయాక రైతులకు కిలోకు 12 రూపాయ‌లు ఇస్తామన్నారని విమ‌ర్శించారు.

రైతుల‌కు మద్దతుగా తాను బంగారుపాళ్యం వెళ్లి ప‌రామ‌ర్శించిన త‌ర్వాత‌.. కేంద్రానికి లేఖ రాశార‌ని వ్యాఖ్యానించారు. ధరలు పతనం కావడంతో గత ఏడాదిలానే ఈ ఏడాది కూడా రైతులకు మేలు చేసేలా కేంద్రం ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి, కేంద్ర మంత్రి కుమార స్వామి జూన్‌ 24న లేఖరాస్తే, జూన్‌ 25న కేంద్ర వ్యవసాయశాఖమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నుంచి మామిడి కొనుగోలుకు సానుకూల స్పందన వచ్చిందన్నారు.

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుతాన‌ని చెబుతున్న చంద్ర‌బాబు.. రైతుల‌కు ఏం మేలు చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో కూడా మామిడి రైతులకు ధర రావడంలేదని, అయినా.. ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. చంద్రబాబుగారు తీరిగ్గా జూన్‌ 28న లేఖ రాశారని అన్నారు. చంద్రబాబు తన వారైన గల్లా ఫుడ్స్‌, శ్రీని ఫుడ్స్‌ కే న్యాయం జరగాలి అన్నట్టుగా వ్యవహరిస్తార‌ని విమ‌ర్శించారు.

This post was last modified on July 1, 2026 4:06 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

1 hour ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

3 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

4 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

12 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago