పదవుల కోసమే అంటే పవన్ ఊరుకోరు

వ‌చ్చే ఎన్నిక‌ల‌తోపాటు.. పార్టీ ప‌రంగా దూకుడుగా వ్య‌వ‌హ‌రించేందుకు ముఖ్యంగా వైసీపీ వంటి పార్టీల‌కు చెక్ పెట్టేందుకు.. సీనియ‌ర్ నాయ‌కులు కావాల‌ని భావిస్తున్న జ‌న‌సేన పార్టీ ఇప్ప‌టికే చేరిక‌లను ప్రోత్స హించాల‌ని నిర్ణ‌యించింది. పార్టీలు ఏవైనా కూడా.. వ‌చ్చే నాయ‌కుల‌కు ఎర్ర తివాచీ ప‌రిచి ముందుకు సాగాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల 20 రోజుల కింద‌ట చేరిక‌ల‌ క‌మిటీల‌ను ఏర్పాటు చేసింది. వ‌చ్చే ఆరు మాసాల్లో పార్టీలో సీనియ‌ర్ల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రోసారి చేరిక‌ల క‌మిటీల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆరా తీశారు. ఎం దాకా వ‌చ్చింద‌ని.. ఆయ‌న ప్ర‌శ్నించారు. ఎవ‌రైనా ట‌చ్‌లోకి వ‌స్తున్నారా? అనే విష‌యాలు తెలుసుకున్న ట్టు జ‌న‌సేన పార్టీ కేంద్ర కార్యాల‌య వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో కొన్ని స‌మ‌స్య‌లను చేరిక క‌మిటీల్లో ఉన్న ముఖ్య నాయ‌కులు ప‌వ‌న్ దృష్టికి తీసుకువెళ్లిన‌ట్టు తెలిపాయి. ప్ర‌ధానంగా పార్టీలో చేరేందుకు టికెట్ల వ్య‌వ‌హారం ఇబ్బందిగా మారింద‌న్న‌ది వారి ప్ర‌ధాన స‌మ‌స్య‌.

వైసీపీ లేదా ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చేందుకు కొంద‌రు రెడీగానే ఉన్నార‌ని.. కానీ, పార్టీలోను, వ‌చ్చే ఎన్ని కల్లో టికెట్ల విష‌యంలోనూ వారు ఆశ‌లు పెట్టుకుంటున్నార‌ని.. దీనిపై స్ప‌ష్టత ఇవ్వాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. అయితే. ప‌వ‌న్ వ్యూహం వేరేగా ఉంది. ముందు పార్టీప‌రంగా సిద్ధాంతాల‌ను అవ‌గ‌తం చేసుకుని ముందుకు సాగేవారిని ఆయ‌న ఆహ్వానిస్తున్నారు. అలా కాకుండా కేవ‌లం ప‌ద‌వుల కోస‌మే అంటే క‌ష్ట‌మ‌న్న‌ది కూడా తేల్చి చెప్పిన విష‌యం. ఇదే ఇప్పుడు చేరిక‌ల‌కు ప్ర‌ధాన అడ్డంకిగా ఉంద‌ని అంటున్నారు.

మ‌రోవైపు.. పార్టీలో ఉన్న సీనియ‌ర్లు, ఆది నుంచి పార్టీ జెండా మోసిన వారికి ప్రాదాన్యం పెంచేందుకు ప‌వ‌న్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇటీవ‌ల రాజ్య‌స‌భ ఎంపిక త‌ర్వాత‌.. జ‌న‌సేన ఆవిర్భావం నుంచి ఉన్న నాయ‌కులు విస్తు పోయార‌న్న‌ది వాస్త‌వం. ఎప్ప‌టి నుంచో తాము పార్టీ కోసం ప్ర‌య‌త్నాలు చేశామ‌ని, 2019, 2024 ఎన్నిక‌ల్లో అలుపెరుగ‌ని కృషి చేశామ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో వారు గుర్తింపు కోరుకుంటు న్నారు. దీంతో కొత్త‌గా పార్టీలో చేరేవారికి ఇత‌మిత్థంగా ఎలాంటి హామీ ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఇదే ఇప్పుడు చేరిక‌ల క‌మిటీల‌కు ముంద‌ర కాళ్ల‌కు బంధంగా మారింద‌న్న చ‌ర్చ సాగుతోంది.